గోదావరిఖని: తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే కె.శంకరయ్య బహిరంగంగా అనుచిత వాఖ్యలు చేయడం అత్యంత దుర్మార్గమని బీఆ ర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మె ల్యే కోరుకంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీ ఎం, ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డి మాండ్ చేశారు. బుధవారం గోదావరిఖని వన్ టౌ న్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ, కేసీఆర్ రాష్ట్రానికి పట్టిన పీడ అని, వెయ్యి డప్పులతో ర్యాలీ తీస్తున్నామని షాద్‌నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకరయ్య వ్యాఖ్యలు చేయడం శోచనీయమన్నారు. రూ.కోట్లు ఆశజూపి, స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే నేతృత్వంలో కొందరిని కేసీఆర్ ఇంటికి పంపి అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. ప్రజలు పరిపాలన చేయడానికి అవకాశం ఇ స్తే, దానిని పక్కనపెట్టి తెలంగాణ తెచ్చిన నేతపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదన్నారు. బీఆర్‌ఎస్ నాయకులు మురళీధర్‌రావు, మేకల సమ్మ య్య, తాళ్ల రాజన్న, మారుతి, అచ్చ వేణు, నూతి తిరుపతి, మేడి సదానందం, సాయి, ఈదునూరి శ్రీకాంత్, కిరణ్‌జీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.


