కనీస విద్యానైపుణ్యాలు అవసరం | - | Sakshi
Sakshi News home page

కనీస విద్యానైపుణ్యాలు అవసరం

Sep 10 2026 12:33 AM | Updated on Sep 10 2026 12:33 AM

● కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

మంథనిరూరల్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కనీస విద్యానైపుణ్యాలు కల్పించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. ఆరెంద, మల్లారం, వెంకటాపూర్‌, స్వర్ణపల్లి, భట్టుపల్లి, ఖాన్‌సాయిపేట ప్రభు త్వ పాఠశాలలను బుధవారం పరిశీలించారు, వెంకటాపూర్‌ – ఆరెంద మధ్య చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు పరిశీలించారు. ఎంపీడీవో శ్రీజారెడ్డి, ఎంపీవో షబ్బీర్‌ పాషా, పీఆర్‌ ఏఈ జగదీశ్‌ పాల్గొన్నారు.

సీ్త్రనిధి రికవరీని 90శాతం పెంచాలి

పెద్దపల్లి: సీ్త్రనిధి రుణాల రికవరీని ఈనెలాఖరులోగా 90శాతం పెంచాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. సీ్త్రనిధి రుణాల ప్రగతి, డిజిటల్‌ సేవల వినియోగం తదితర అంశాలపై కలెక్టరేట్‌లో సమీక్షించారు. డీఆర్‌డీవో కాళిందిని, అధికారులు పాల్గొన్నారు.

రామగుండంలో రూ.405 కోట్ల పనులులు

రామగుండంలో రూ.405కోట్ల పనులకు ప్రతిపాద నలు ఉన్నాయని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. అదన పు కలెక్టర్‌ అరుణశ్రీతో కలిసి సమీక్షించారు. సోలా ర్‌ పవర్‌ ప్లాంట్‌కు 30 ఎకరాలు కేటాయించాలని, ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని మళ్లీ వినియోగించేలా చర్యలు చేపట్టాలని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా స్టార్మ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్మాణానికి డీపీఆర్‌ సిద్ధం చే యాలని, వాణిజ్య సముదాయాలు అభివృద్ధి చే యాలని, సింగరేణి ఇంటిగ్రేటెడ్‌ వేస్ట్‌ టూ ఎనర్జీ, గ్రీ న్‌ చార్కోల్‌ ప్లాంట్‌ పనుల్లో వేగం పెంచాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement