పెద్దపల్లి/గోదావరిఖని: ప్రజాకవి కాళోజీ నారా యణరావు జయంతి బుధవారం జిలాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ భాషా దినోత్సవం జరిపారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాములు కాళోజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రామగుండం పోలీస్ కమిషరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా ప్రజాకవి చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. కాళోజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూ చించారు. కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో అధికారులు ప్రకాశ్, శారద, మహేందర్, గోదావరిఖనిలో జరిగిన కార్యక్రమంలో అదనపు డీసీపీ(అడ్మిన్) శ్రీనివాస్, ఏసీపీలు నాగేంద్రగౌడ్, ప్రతాప్, ఏవో శ్రీనివాస్, సీఐలు భీమేశ్, శ్రీనివాస్, ఆర్‌ఐలు శేఖర్, రమేశ్, సీసీ సందీప్ తదితరులు పాల్గొన్నారు.


