పెద్దపల్లి: అసెంబ్లీ స్పీ కర్ గడ్డం ప్రసాద్ కు మార్‌పై అనుచిత వ్యా ఖ్యలు చేసిన ఎమ్మెల్సీ లు తాతా మధు, నవీన్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు డిమాండ్ చేశారు. మంగళవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ సూచనల మేరకు కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హంగామా చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఆదినుంచీ దళిత వ్యతిరేక వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు
పెద్దపల్లి: జిల్లాలో వా నాకాలం ధాన్యం కొనుగోళ్లకు పకడ్బందీ ఏ ర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ శ్రీరాము లు ఆదేశించారు. ధా న్యం కొనుగోళ్ల ఏర్పాట్లపై కలెక్టరేట్‌లో మంగళవారం అధికారులతో సమీక్షించారు. అక్టోబర్ 1 నుంచి ప్రతిపాదిత కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రా రంభమవుతాయన్నారు. జిల్లాలో కనీసం 2 ల క్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోదాంల ను గుర్తించాలని సూచించారు. ఈసారి కొనుగోళ్లలో ఏఐ సాంకేతికతను వినియోగించనున్న ట్లు వెల్లడించారు. జిల్లా పౌరసరఫరాల అధి కారి శ్రీనాథ్, మేనేజర్ శ్రీకాంత్, డీసీవో శ్రీమా ల, కాంట్రాక్టర్లు, అధికారులు పాల్గొన్నారు.
బీజేవైఎం నేతల ‘చావుడప్పు’
పెద్దపల్లి: ఫీజురీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీజేవైఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం నిరసన చేపట్టారు. తొలుత బీజేవైఎం నేత ఎర్రోళ్ల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి ‘చా వు డప్పు’ కొట్టి ప్రభుత్వ తీరును నిరసించారు. నాయకులు పెంజర్ల రాకేశ్, తంగడ రాజేశ్వరరావు, పోల్సాని సంపత్‌రావు, మేకల శ్రీనివా స్, ఒల్లే తిరుపతి, ఈర్ల శంకర్, కావేటి రాజగోపాల్, ఉప్పు కిరణ్, రాజమహంత్, గుడ్ల సతీశ్, సురేందర్, సతీశ్, కుమార్ పాల్గొన్నారు.
రైల్వేస్టేషన్ ఎదుట నిరసన
రామగుండం: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే కనీస వేతన సలహా మండలిలో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలకు ప్రాతిని ధ్యం కల్పించకపోవడాన్ని నిరసిస్తూ తెలంగా ణ రైల్వే కాంట్రాక్ట్ క్యాజువల్ అండ్ ఆల్ హ మాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రైల్వేస్టేషన్ ఎదుట ప్లకార్డుల తో ఆందోళన చేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు భిక్షపతి, నాయకులు రామాచారి, యాసిన్, తిరుపతి, కృష్ణ, మల్లేశ్, దేవమ్మ, ప్రమీల, సావిత్రి, రాజేశ్వరి, పద్మ ఉన్నారు.
ప్రమాణాలు పాటించాలి
పెద్దపల్లిరూరల్: గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మండప నిర్వాహకులు విద్యుత్ భద్రతా ప్రమాణాలను పాటించాలని ట్రాన్స్‌కో ఎస్ ఈ గంగాధర్ సూచించారు. నాణ్యమైన విద్యుత్ తీగలనే వాడాలని, వర్షం కురిసిన స మయంలో తడి చేతులతో స్విచ్, వైరు తాకొద్దని, కేబుళ్లు చిందరవందరగా లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. అత్యవసర సమయాల్లో 1912 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
బీమా సౌకర్యం కల్పించాలి
కోల్‌సిటీ: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, స్థానిక సంస్థల్లోని అవుట్‌సోర్సింగ్ ఉ ద్యోగులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించా లని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకట య్య కోరారు. మంగళవారం మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీదేవికి ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు కొంకటి ల క్ష్మీనారాయణ, రాంబాబు నాయక్‌తో కలిసి వి నతిపత్రం అందజేశారు. పీవోఏ చట్టం అధ్యక్షుడు బిట్ల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఉద్యోగులకు పదోన్నతి
జ్యోతినగర్: ఎన్టీపీసీ ఉద్యోగులకు పదోన్నతి కల్పిస్తూ కార్పొరేట్ హెచ్‌ఆర్ డిప్యూటీ జనరల్ మేనేజర్ గౌతంసింగ్ భాటి ఉత్తర్వులు జారీచేశారు. డబ్ల్యూ –10 నుంచి డబ్ల్యూ –11కు ఒక రు, డబ్ల్యూ–11 నుంచి డబ్ల్యూఎస్–జీకి ము గ్గురు, డబ్ల్యూ–8 నుంచి9కి ఒకరు, డబ్ల్యూ –7 నుంచి డబ్ల్యూ –8కి ఐదుగురు, డబ్ల్యూ–6 నుంచి 7కు ఇద్దరు పదోన్నతి పొందారు.


