పారదర్శకంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

పెద్దపల్లి: జిల్లాలో చేపట్టిన డిజిటల్‌ క్రాప్‌ సర్వేను పకడ్బందీగా, పారదర్శకంగా పూర్తి చేయాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. వ్యవసాయ శాఖ పనితీరుపై కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. డీఏవో శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఆలయాల అభివృద్ధికి రూ.20 కోట్లు

గోదావరి పుష్కరాల పనులను అధికారులు, ప్ర జాప్రతినిధుల సమన్వయంతో వేగవంతంగా పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. పుష్కరాల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. రూ.25 కోట్లతో రోడ్ల అభివృద్ధి, మంథనిలోని ఆలయాల అభివృద్ధికి రూ.20 కో ట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఆర్డీవో సు రేశ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ మనోహర్‌, చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ సయేందర్‌రెడ్డి, దేవాదా య శాఖ ఏడీ సుప్రియ తదితరులు పాల్గొన్నారు.

నోటీసులపై పకడ్బందీ విచారణ

పాలకుర్తి: ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ, భూముల రీసర్వే ప్రక్రియలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష ఆదేశించారు. పాలకుర్తి మండలంలో ఆయన పర్యటించారు. ఎస్‌ఐఆర్‌ నోటీసుల విచారణ, భూముల రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు. బసంత్‌నగర్‌ విమానాశ్రయ ప్రతిపాదిత స్థలంలోని కొత్త తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఏడీ సర్వేయర్‌ సోమేశ్వర్‌, తహసీల్దార్‌ సునీత, ఆర్‌ఐ సంతోష్‌, గుడిపల్లి సర్పంచ్‌ కాసర్ల శ్రీసుధ, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌, కారోబార్‌ శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

కలెక్టర్‌ కోయ శ్రీహర్ష

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement