పురాతన ఆలయం.. ఆదరణ శూన్యం | - | Sakshi
Sakshi News home page

పురాతన ఆలయం.. ఆదరణ శూన్యం

Sep 8 2026 11:59 PM | Updated on Sep 8 2026 11:59 PM

సమన్వయ లోపమే కారణం

పెద్దపల్లిరూరల్‌: అరుదైన, అతి పురాతన శ్రీరంగ నాయకస్వామి ఆలయం.. శ్రీరంగం తర్వాత అ లాంటి తరహా ఆలయమే ఇది. ఆలనా పాలనాలేక శిథిలావస్థకు చేరుతోంది. వందేళ్లకుపైగా చరిత్ర కలిగిన ఆలయానికి 400 ఎకరాలకుపైగా భూములు ఉన్నా ఆక్రమణల పాలైంది. ఆలయం ఎదుట కనీ సం ధ్వజస్తంభం కూడా ఏర్పాటు చేయించలేని దీనస్థితికి చేరింది భక్తులు మనోవేదనకు గురవుతున్నా రు. పెద్దపల్లి మండలం ముత్తారం గ్రామంలో డంగుసున్నంతో నిర్మించిన పురాతన ఆలయం.. దేవాదాయ శాఖ, పురావస్తుశాఖ అధికారుల మధ్య ఉన్న భేదాభిప్రాయాలతో అభివృద్ధికి నోచడం లేదనే విమర్శలు తీవ్రంగా ఉన్నాయి.

ఆలయ భూములు అన్యాక్రాంతం

ఆనాటి జమీందార్‌ ఎరబాటి రంగారావు ఆలయం నిర్మించారు. దీనినిర్వహణ కోసం 400కుపైగా ఎకరాలను అప్పగించారు. పెద్దపల్లి మండలంలోని కనగర్తి, కాసులపల్లి, బొంపల్లి పరిధిలో విస్తరించి ఉన్న ఈ ఆలయ భూములు ప్రస్తుతం ఆక్రమణదారుల పరమయ్యాయి.

విరాళాలు.. అభివృద్ధికి ప్రణాళికలు

ముత్తారం శ్రీరంగనాయకస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు అప్పటి మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి ప్రభుత్వం నుంచి రూ.32 లక్షలు మంజూరు చేయించారు. అందుకు కార్ఫస్‌ఫండ్‌ రూ.7లక్షలు చెల్లించాల్సి వచ్చింది. అందులో ఆలయానికి భూములు దానం చేసిన ఎరబాటి వారసులు రూ.3.50లక్షలు అందించగా.. భక్తులు, గ్రామస్తులు, దాతల నుంచి మిగతా మొతం సేకరించినట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

రంగనాయకస్వామి ఆలయం పురావస్తు శాఖ అధీనంలో ఉంది. అభివృద్ధి కోసం ఆ శాఖ నిధులు సమకూర్చింది. దేవాదాయ, పురావస్తు శాఖల అధికారుల సమస్వయం కుదరని కారణంగా పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. అభివృద్ధి పనులను గతంలో మాదిరిగానే డంగుసున్నంతోనే చేపట్టాలని పురావస్తు శాఖ అధికారులు పేర్కొన్నారు. కాంక్రీటు పనులను అంగీకరించక పోవడంతో దేవాదాయ శాఖ పనులను అర్ధంతరంగా ఆపేయాల్సి వచ్చింది.

ముత్తారం ‘రంగనాయకుడి’ పై నిర్లక్ష్యం

ఆలయ భూములన్నీ అన్యాక్రాంతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement