● మండల స్థాయి పోటీలకు రంగం సిద్ధం
జిల్లాలో..
పెద్దపల్లి: పాఠశాల విద్యార్థుల్లో క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు నిర్వహించే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) పోటీలకు రంగం సిద్ధమవుతోంది. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాలల క్రీడా సమాఖ్య ఈనెల 31 నుంచి పోటీలను దశలవారీగా నిర్వహించేందుకు అధికారులు ఏ ర్పా ట్లు చేస్తున్నారు. మండల, జోన్, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించి ప్రతిభ చాటిన విద్యార్థులను తదుపరి స్థాయికి ఎంపిక చేయనున్నారు.
పాఠశాలల వారీగా ఎంపిక
ఎస్‌జీఎఫ్ పోటీల్లో భాగంగా ముందుగా పాఠశాలల స్థాయిలో క్రీడాకారులను గుర్తించి మండలస్థాయి పోటీలకు పంపిస్తారు. అండర్–14,17 విభాగాల్లో మండల, జోన్, జిల్లాస్థాయిల్లో పోటీలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. అనంతరం అండర్–19 విభాగంలో పోటీలు నిర్వహిస్తారు. అథ్లెటిక్స్, కబడ్డీ, ఖోఖో, వాలీ బాల్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, రెజ్లింగ్, టెన్నిస్ తదితర పోటీలు నిర్వహిస్తారు. క్రీడల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ అందించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.
మైదానాల్లో సందడి
ఎస్‌జీఎఫ్ పోటీలు ప్రారంభం కానుండడంతో పాఠశాలల్లో క్రీడా సందడి నెలకొంటోంది. ఇప్పటికే విద్యార్థులకు ప్రాథమిక శిక్షణ ఇస్తున్నారు. పోటీల నిర్వహణకు అవసరమైన మైదానాలు, క్రీడా సామగ్రి, ఇతర ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు.
31న మండల స్థాయి పోటీలు
ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 5వరకు మండల స్థాయి పోటీలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ లక్ష్మణ్ తెలిపారు. సెప్టెంబర్ 6–10 వరకు జోన్, 21–25 లోపు జిల్లా స్థాయి పో టీలు పూర్తి చేసిన తర్వాత ఉమ్మడి జిల్లాకు క్రీడాకా రులను ఎంపిక చేస్తారు. అక్కడ ఎంపికైన వారు రా ష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు. ప్రభుత్వ, ప్రైవే టు పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలలు : 458
కేజీబీవీలు : 8
జూనియర్ కళాశాలలు : 14
గురుకులాలు : 10
రెసిడెన్షియల్ కళాశాలలు : 16


