న్యూస్‌రీల్
వైభవం.. మల్లన్న పెద్దపట్నం
ఓదెల: పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీమల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి పెద్దపట్నం వేడుకలు కన్నులపండువగా నిర్వహించారు. ఆలయ ఈవో సదయ్య, చైర్మన్ చీకట్ల మొండయ్య, ప్రధాన అర్చకుడు దూపం వీరభద్రయ్య ఆధ్వర్యంలో స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులు చేశారు. సుమారు 100 మంది ఒగ్గు పూజారులు పసుపు, కుంకుమలతో మూడు గంటలపాటు పెద్దపట్నాలు వేశారు. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు, ట్రాన్స్‌కో ఏడీఏ రవీందర్ తదితరులు హాజరై ప్రత్యేక పూజలు చేశారు.


