‘ఎల్‌నినో ప్రభావంతో పత్తి మొక్కలు ఆదిలోనే మాడిపోతున్నయి.. వానదేవుని కరుణ కోసం మొక్కని గడపలేదు.. చేయని పూజలేదు.. పదిహేనేళ్లక్రితం పైపులు వేసి దుక్కిదున్నినం.. ఇగో గిప్పుడూ గదే దుస్థితి వచ్చింది’ అంటున్నాడు ముత్తారంలోని రైతు పెద్ద ఓదెలు. నీళ్లులేక ఎండిపోతున్న పంటను కాపాడుకునేందుకు కిలోమీటర్ల పొడవున పైపులు వేసి నీటితడి అందించక తప్పడం లేదంటున్నాడు గౌరెడ్డిపేటకు చెందిన మరోరైతు కొమ్ము జీవన్. ఏ రైతును కదిలించినా చినుకు జాడకోసం ఎదురుచూడడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ కనిపించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


