గర్వంగా ఉంది | - | Sakshi
Sakshi News home page

గర్వంగా ఉంది

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

ఓసీపీ– వన్‌కు మూడోసారి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ రావడం గర్వంగా ఉంది. బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతతోపాటు మిగతా విషయాల్లోనూ అగ్రగామిగా నిలుస్తున్నాం. సంక్షేమం, పర్యావరణం, ప్రభావిత గ్రామాల అభివృద్ధిలోనూ ముందంజలో ఉన్నాం. సహకరించిన కార్మికులు, అధికారులకు కృతజ్ఞతలు.

– గడ్డం తిరుపతి, ఐఎన్‌టీయూసీ నేత, ఓసీపీ–1

పోటీతత్వంతోనే..

అధికారులు, కార్మికులు పోటీపడి సమష్టిగా పనిచేయడంతోనే ఈఘనత సాధ్యమైంది. అవార్డు రావడంతో మాపై మరింత బరువు, బాధ్యత పెరిగింది. ఏదిఏమైనప్పటికీ ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇదే రేటింగ్‌తో బాగా పనిచేస్తాం.

– డి.తిరుపతి, ఏఐటీయూసీ నేత, ఓసీపీ–1

రాజీలేకుండా ముందుకు

కోల్‌కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ నిబంధనలకు లోబడి రాజీలేకుండా ముందుకు సాగడంతోనే ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ అవార్డు సాధ్యమైంది. నిరంతర కృషి, రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి, పర్యావరణ పరిరక్షణ.. ఇలా ఏడు అంశాలపై దృష్టి సారించాం. మూడోసారి ఫైవ్‌స్టార్‌ రేటింగ్‌ సాధించడం సంతోషంగా ఉంది.

– రావులు పాపయ్య, గని మేనేజర్‌, ఓసీపీ–1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement