మీసేవ కేంద్రాల్లో ఉచిత సేవలు | - | Sakshi
Sakshi News home page

మీసేవ కేంద్రాల్లో ఉచిత సేవలు

Jul 13 2026 4:25 AM | Updated on Jul 13 2026 4:25 AM

పెద్దపల్లి: స్పెషల్‌ ఇంటెన్షి వ్‌ రివిజన్‌(ఎస్‌ఐఆర్‌) ప్ర క్రియను మీసేవా కేంద్రా ల్లో ఉచితంగా నమోదు చేయొచ్చని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రజల సౌకర్యార్థం మీసేవ కేంద్రాల్లో ఓటరు ఎన్యూమరేషన్‌ ఆన్‌లైన్‌ ప్రక్రియను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

‘సర్‌’ ప్రక్రియ పరిశీలన

కమాన్‌పూర్‌: జూలపల్లిలో చేపట్టిన సర్‌ ప్రక్రియను మంథని ఆర్డీవో సురేశ్‌ ఆదివారం పరిశీలించారు. ఎన్యూమరేషన్‌ పత్రాలు అందని వా రిని గుర్తించి ఇవ్వాలని, నింపడం రానివారితో బీఎల్‌వోలతో పూర్తి చేయించి అందజేయాలని సూచించారు. ఆయన వెంట తహసీల్దార్‌ వాసంతి, సర్పంచ్‌ అనిత, జీపీవో రవీందర్‌, పంచాయతీ కార్యదర్శి సదయ్య ఉన్నారు.

పారదర్శకంగా ఉండాలి

పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్‌ : ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ ను పారదర్శకంగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని పెద్దపల్లి ఆర్డీవో గంగయ్య తెలిపారు. జిల్లా కేంద్రంలోని మీ సేవా కేంద్రాలను ఆయన ఆదివారం తనిఖీ చేిశారు. వార్డుల్లో సర్‌ ప్రక్రియపై ఆరా తీశారు. గడువులోగా సర్‌ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఆన్‌లైన్‌తోపాటు మీ సేవా కేంద్రాల్లో కూడా నమోదు సౌకర్యం కల్పించామని అన్నారు. డిప్యూటీ తహసీల్దార్‌ విజేందర్‌, కౌన్సిలర్‌ గుజ్జుల కుమార్‌, నాయకులు, బీఎల్‌వోలు పాల్గొన్నారు.

గుడికి రూ.2 లక్షల విరాళం

కాల్వశ్రీరాంపూర్‌: స్థానిక పాండవులగుట్ట శ్రీ యోగశాస్త్ర అయ్యప్ప ఆలయం ధ్వజస్తంభం నిర్మాణం కోసం హైదరాబాద్‌కు చెందిన ఎన్‌ఆ ర్‌ఐ దంపతులు డాక్టర్‌ జంకె శివప్రియ– శ్రీధర్‌రెడ్డి ఆదివారం రూ.2 లక్షల విరాళం అందించారు. పూజారి దత్తుశర్మ ఆధ్వర్యంలో వారికి పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ నిర్మా ణ కమిటీ చైర్మన్‌ పెద్దిరెడ్డి వీరారెడ్డి, సభ్యులు ఎన్‌ఆర్‌ దంపతులను శాలువాలతో సత్కరించారు. సభ్యులు కాసర్ల తిరుపతిరెడ్డి, మేడి దేవేందర్‌గౌడ్‌, పాల మల్లేశ్‌, పత్తి మల్లారెడ్డి, చిన్నస్వామి, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అర్హులు మిస్‌ కావొద్దు

మంథని: బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎస్‌ఐఆర్‌లో చు రుకుగా పాల్గొని అర్హుల ఓటు మిస్‌ కాకుండా బాధ్యత తీసుకోవాలని మంథని మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధు కోరారు. స్థానిక అంబేడ్కర్‌నగర్‌ వాసులకు సర్‌ నమోదుపై అవగాహన క ల్పించారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీ లు ఓటుహక్కుతోనే గౌరవం పొందుతున్నా రని తెలిపారు. ఓటుహక్కు లేకుంటే ఇంకా 78 ఏళ్లయినా మనుషులుగా గుర్తించరనేది ప్రస్తుతం కనపడుతోందని అన్నారు. నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ కేవలం 25 నుంచి 30శాతం వరకే నమోదైనట్లు తెలిసిందని చెప్పారు. ఎ న్యూమరేషన్‌ ప్రక్రియను వేగవంతం చేయా లని కోరారు. మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, యాకూబ్‌, పుప్పాల తిరుపతి, తరగం శంకర్‌లాల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

అధికారులకు పదోన్నతి

జ్యోతినగర్‌: రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులోని 77 మంది అ ధికారులకు పదోన్నతి లభించింది. ఈమేరకు సదరన్‌ రీజియ న్‌ హెడ్‌ క్వార్టర్స్‌ ఆర్‌హెచ్‌వో హెచ్‌ఆర్‌ సూర్యనారాయణ పాణిగ్రాహి ఉత్తర్వులను విడుదల చేశారు. ఎగ్జ్జిక్యూటివ్‌ గ్రేడ్‌(ఈ)–6 నుంచి 7కు 12 మంది, ఈ–5 నుంచి ఈ6కు నలుగురు, ఈ–4 నుంచి ఈ–5కి ముగ్గురు, ఈ–3 నుంచి ఈ–4కు నలుగురు, ఈ–2 నుంచి ఈ–3కి 10 మంది, ఈ–1 నుంచి ఈ–2కు 37 మంది, ఈ–0 నుంచి ఈ–1కు ఏడుగురు అధికారులు పదోన్నతి పొందారు. హెచ్‌ఆర్‌లో సీనియర్‌ మేనేజర్‌ దీపక్‌ కుమార్‌ పాఠక్‌ డీజీఎంగా కుడ్గి ప్రాజెక్టుకు బదిలీ అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement