● తరచూ లీకేజీలు ● ప్రజలకు తప్పని నీటి తిప్పలు ● వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు ● సుల్తానాబాద్ మున్సిపల్‌లో దుస్థితి
పెద్దపల్లి: జిల్లాలోని సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలో తాగునీటి పైప్‌లైన్లు తరచూ లీకవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులకు తరచూ ఫిర్యాదు చేసినా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. లీకేజీలతో తాగునీరు వృథాగా పోతోంది. కలుషిత నీరు పైప్‌లైన్లలోకి చేరే ప్రమాదం ఉండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. రోడ్ల కింద ఉన్న పైప్‌లైన్లపై ఓవర్‌లోడ్ వాహనాల ఒత్తిడి పెరగడంతో పైపులు దెబ్బతింటున్నాయి. ఇలాంటి వాహనాలపై కఠిన చర్య లు తీసుకుంటే లీకేజీల సమస్య తగ్గే అవకాశముందని స్థానికులు సూచిస్తున్నారు.
విస్తరిస్తున్న పట్టణం.. పెరుగుతున్న అవసరాలు
మేజర్ గ్రామపంచాయతీగా ఉన్న సుల్తానాబాద్ ఏడేళ్ల క్రితం మున్సిపాలిటీగా అవతరించింది. అనంతరం పూసాల, సుగ్లాంపల్లి గ్రామాలు మున్సిపాలిటీలో విలీనమయ్యాయి. జనాభా పెరుగుతున్నా సదుపాయాల విస్తరణ ఆ స్థాయిలో జరగడంలేదని ప్రజలు చెబుతున్నారు. కొత్తకాలనీల్లో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి పైప్‌లైన్లు, నల్లా కనెక్షన్లు పూర్తిస్థాయిలో లేవు.
మున్సిపల్ పరిధిలో పరిస్థితి
ఆరోగ్యానికి ముప్పు
మున్సిపల్ సమాచారం
పట్టణంలో నల్లా కనెక్షన్లు 4,238
పాతవాటర్ ట్యాంకులు 2
రెండింటి సామర్థ్యం(లీటర్లలో) 1,280
అమృత్ 2.0 వాటర్ ట్యాంకులు 1
నీటి సామర్థ్యం(లీటర్లలో) 1,400
పట్టణ జనాభా 20,496
రోజూ సరఫరా అవుతున్న నీరు 2.27 (మిలియన్ లీటర్లు)


