పెద్దపల్లి: సీఎమ్మార్ బకాయిదారులకు ప్రభుత్వం విధించిన గడువు ముగిసింది. బియ్యం అప్పగించని మిల్లర్లపై అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలోని ఓ రైస్‌మిల్లు యజమానిని అరెస్ట్ కూడా చేసింది. అప్రమత్తమైన రైస్‌మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు.. ఇటీవల కలెక్టర్‌ను కలిశారు. తమ పరిస్థితిని చూసి చర్యలు తీసుకోవ్దని విన్నవించారు.
మూడు గ్రూపుల ఏకాభిప్రాయం
జిల్లాలో రా రైస్, బాయిల్డ్ రైస్, మినీ రైస్ మిల్లులు ఉన్నాయి. వీటి నిర్వాహకులు ఎవరికివారే మూడు గ్రూపులుగా విడియారు. అధికారులు తీసుకుంటున్న తాజా చర్యలతో మూడు గ్రూపులు ఇప్పుడు ఏకమయ్యాయి. బియ్యం బకాయిలు చెల్లించేందుకు మరింత గడువు కావాలని ఇటీవల కలెక్టర్‌ను కలిసి విన్నవించారు. జిల్లాలో 149 రైస్ మిల్లులు బకాయిలు అప్పగించాల్సి ఉందని సివిల్ సప్లయ్ డీఎం శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. బియ్యం విలువ రూ.495 కోట్లు ఉందన్నారు. ఇప్పటివరకు 89 రైస్ మిల్లుల నుంచి రూ.278 కోట్లు రికవరీ చేశామని, ఇంకా 57 మిల్లు నుంచి రూ.218 కోట్లు రావాల్సి ఉందని ఆయన వివరించారు.
పూర్తిస్థాయిలో బియ్యం తీసుకోవాలి
2025–26 వానాకాలం ధాన్యంలోని బియ్యం పూర్తిగా సేకరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇవ్వాలని రైస్‌మిల్లర్లు కోరారు. 2025–26 యాసంగి ధాన్యం కూడా బయటకు తీసుకురావడానికి అవకాశం ఇవ్వాలని కలెక్టర్ కోరారు. మోరపల్లి తిరుపతిరెడ్డి, నగునూరి అశోక్ కుమార్, దేవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఏకమైన మూడు రైస్‌మిల్లర్స్ గ్రూపులు


