గోదావరిఖని: అధికారులు నిర్ణయం తీసుకున్నారు.. స్టాట్యుటరీ శిక్షణకు ఎంపిక చేశారు.. ట్రెయినింగ్ కూడా పూర్తిచేశారు.. అసలు కథ ఇక్కడే ఆరంభమైంది.. ఎంపికై నవారు శిక్షణకు అర్హులు కాదని ఆ తర్వాత తేల్చారు.. అంతటితో ఆగకుండా శిక్షణ కాలంలో కార్మికులకు అందించిన అలవెన్స్‌లు, ప్లేడేలు, పీహెచ్‌డీలూ రికవరీ చేశారు.. కనీసం నోటీసుకూడా ఇవ్వకుండా బదిలీ వర్కర్ల(జనరల్ అసిస్టెంట్ ట్రెయినీ) వేతనంలో కోత విధించారు. సింగరేణి రామగుండం డివిజన్–2 వకీల్‌పల్లి గనిలోని 23 మంది కార్మికుల దుస్థితి ఇది.
ఎవరిని ఎంపిక చేయాలి?
వాస్తవానికి బదిలీ వర్కర్ల(జనరల్ అసిస్టెంట్ ట్రెయినీ)లను స్టాట్యుటరీ శిక్షణకు ఎంపిక చేయడం అధికారుల తప్పిదమని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. వారి అనాలోచిత నిర్ణయంలో కార్మికులను బలిపశువులను చేశారని మండిపడుతున్నారు. యాజమాన్యం సూచన మేరకే కార్మికులు స్టాట్యుటరీ శిక్షణ కోసం దరఖాస్తు చేశారు. ఎస్‌వోటూ జీఎం ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వీటిని పరిశీంచింది. అందులో 23 మందిని ఎంపిక చేసింది. ఎంపికై న వారికి శిక్షణ ఇవ్వాలని ఉత్తర్వులిచ్చింది. దీంతో అందరూ శిక్షణ పూర్తిచేసుకున్నారు. తామ కోల్‌కట్టర్, టింబర్‌మెన్, డీపిల్లరింగ్ పనులు చేసేందుకు(జనరల్ అసిస్టెంట్) అర్హులమనే సంతోషంలో కార్మికులు ఉన్నారు. తీరా ఇంటర్నల్ ఆడిట్‌లో వీరు అసలు శిక్షణకే అర్హులు కాదని అధికారులు తేల్చారు. అంతటితో ఆగకుండా శిక్షణకాలంలో వర్తింజేసిన యాక్టింగ్ అలవెన్స్, బోనస్, ప్లేడేలు, పీహెచ్‌డీలను రికవరీ చేశారు.
సమాచారం ఇవ్వకుండానే రికవరీ..
శిక్షణకు ఎంపిక చేసి, తర్ఫీదు ఇచ్చిన యాజమాన్యం జనరల్ అసిస్టెంట్ ట్రెయినీలు శిక్షణకు అర్హులు కాదని ప్రకటించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. శిక్షణ సమయంలో ఎంపిక కమిటీ జనరల్ అసిస్టెంట్స్‌కు మాత్రమే అర్హత ఉందనే విషయాన్ని చెప్పలేదని కార్మికులు వాపోతున్నారు. కంపెనీ అవసరాల కోసం స్టాట్యూటరీ ట్రెయినింగ్‌కు అర్హత కేటగిరీని వాడుకుని ఇప్పుడు వేతనాల నుంచి రూ.50వేల – రూ.1,40లక్షల వరకు రికవరీ చే యడం ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. రికవరీ చేసిన మొత్తం వాపసు చేయాలని కోరుతున్నారు.
ఎందుకు ఎంపిక చేశారు?
వేతనం ఎందుకు రికవరీ చేశారు?
మనోవేదనలో కార్మికులు
అధికారుల తీరుపై విస్మయం


