తెరుచుకున్న తలుపులు | - | Sakshi
Sakshi News home page

తెరుచుకున్న తలుపులు

Mar 12 2026 7:45 AM | Updated on Mar 12 2026 7:45 AM

కోల్‌సిటీ(రామగుండం): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రి(జీజీహెచ్‌)లో ఎట్టకేలకు బుధవారం సీటీస్కాన్‌ సేవలు ప్రారంభమయ్యాయి. ‘నిలిచిన సీటీ స్కాన్‌ సేవలు’ శీర్షికన ‘సాక్షి’ బుధవారం కథనం ప్రచురించడంతో స్పందించిన వైద్యాధికారులు.. మరమ్మతులు చేసి సీటీస్కాన్‌ను వినియోలోకి తీసుకొచ్చారు. మరోవైపు.. సిటీస్కాన్‌ సేవలు నిలిచిపోవడం, పేషెంట్లను ఓ ప్రైవేట్‌ సీటీస్కాన్‌ సెంటర్‌కు వైద్య సిబ్బంది రెఫర్‌ చేయడంపై అధికారులు విచారణ చేపట్టారు.

ఓసీపీ–3 తనిఖీ

గోదావరిఖని: సింగరేణి ఆర్జీ–2లోని ఓసీపీ–3ని కో ల్‌కంట్రోలర్‌ ఆర్గనైజేషన్‌ బృందం బుధవారం సందర్శించింది. ఎక్స్‌టెన్షన్‌ ప్రాజెక్టు తొలిదశ మూసివే త కోసం తీసుకున్న చర్యలు, వ్యయం, ఇస్క్రో అ కౌంట్స్‌ క్లయిమ్‌ చేసుకోవడం తదితర వివరాలపై ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రావు బృందం ఆరా తీసింది. జీఎం వెంకటయ్య, ఎస్‌వోటూ జీఎం రాముడు, ఏ రియా సేప్టీ ఆఫీసర్‌ సంతోష్‌కుమార్‌ స్వాగతం పలికారు. ప్రాజెక్టు అధికారి ఉదయ్‌హరిజన్‌, మేనేజర్‌ భరత్‌కుమార్‌, సేఫ్టీ ఆఫీసర్‌ లక్ష్మణ్‌రావు, అడిషనల్‌ మేనేజర్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement