కరీంనగర్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా యాదగిరి సునీల్‌రావును నియమిస్తూ పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ఉత్తర్వులు వెలువరించింది. ఈమేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆదేశాలు జారీచేశారు. కరీంనగర్ మాజీ మేయర్ సునీల్‌రావు ఇటీవల డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావుతోపాటు తనకు అండగా ఉన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. కేంద్రంలో మోదీ సర్కార్ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే... రాష్ట్ర ప్రజల పక్షాన తనదైన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, పార్లమెంట్ నియోజకవర్గం కన్వీనర్ ప్రవీణ్‌రావు ఇతర నాయకుల సహకారంతో పార్టీలో ఒక సైనికుడిగా పని చేస్తానని తెలిపారు.


