అభివృద్ధి.. సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమం

Mar 6 2026 8:28 AM | Updated on Mar 6 2026 8:28 AM

అభివృద్ధికి పది థీమ్‌లు

నేటినుంచి 99రోజుల ప్రణాళిక పది అంశాలపైనే ప్రధానంగా ఫోకస్‌ ఐదుదశల్లో అమలుకు ప్రత్యేక కార్యాచరణ

సాక్షి,పెద్దపల్లి:

ప్రభుత్వ విధానాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కోసం రూపొందించిన 99 రో జుల కార్యాచరణ ప్రణాళిక శుక్రవారం ప్రారంభంకానుంది. ‘ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక’ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం నేటినుంచి జూన్‌ 12 వ తేదీ వరకు పకడ్బందీగా అమలు చేయనున్నా రు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర పది అంశాలతో కూడిన యాక్షన్‌ ప్లాన్‌ను ఐదుదశల్లో అమ లు చేసేలా యంత్రాంగం సిద్ధమైంది.

తొలుత దిశానిర్దేశం..

తొలుత ఉమ్మడి జిల్లావారీగా ఇన్‌చార్జి మంత్రి ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించి 99 రోజుల కార్యక్రమాన్ని ఎలా విజయవంతం చేయా లనేదానిపై దిశానిర్దేశం చేయనున్నారు. తొలిరోజు పెండింగ్‌ ఫైల్స్‌ పరిష్కరించడం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. కొత్త సర్పంచులు, కౌన్సిలర్లు, చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లను ఇందులో భాగస్వాములను చేస్తూ, సౌరవిద్యుత్‌ వినియోగాన్ని ప్రోత్సహిస్తారు. వ్యవసాయ పంపుసెట్లకు బదులు సోలార్‌ పంపుసెట్ల వినియోగంపై రైతులకు అవగాహన కల్పిస్తారు. ఇళ్లపైన సోలార్‌ ప్లాంట్లను అమర్చుకోవడం, సోలార్‌ విద్యుత్‌ వినియోగంతోపాటు గ్రిడ్‌కు అనుసంధానించడం ద్వా రా సమకూరే ఆదాయంపై గ్రామాలు, వార్డు, డివిజన్‌లలో అవగాహన కల్పిస్తారు. గ్రామ, వార్డు, డి విజన్‌ సభల్లో కొత్తగా ఇచ్చిన రేషన్‌కార్డులు, సన్న బియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200లోపు యూనిట్ల వ రకు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, ఉచిత బస్సు ప్ర యాణం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ లబ్ధిదారుల వి వరాలు తెలియజేస్తారు. వాటితో గ్రామ, మండల, నియోజకవర్గం, జిల్లాస్థాయిలో కలిగిన లబ్ధిని ప్రజలకు వివరిస్తారు. ప్రతీ ప్రభుత్వ పథకానికి లబ్ధిదారుల ముఖగుర్తింపు(ఫేషియల్‌ రికగ్నైజేషన్‌) ప్రక్రి య చేపట్టి, అర్హులకు కచ్చితంగా లబ్ధి చేకూర్చుతా రు. ఇదేసమయంలో అనర్హులు లబ్ధి పొందకుండా చూసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ కా ర్యక్రమాన్ని అమలు చేయడంతోపాటు పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా మొబైల్‌యాప్‌ సిద్ధం చేశారు.

ఐదు దశలు..

జిల్లావ్యాప్తంగా తొలిదశలో ఏప్రిల్‌ 2న గ్రామ, వార్డు, డివిజన్‌ స్థాయిల్లో సభల నిర్వహణ, రెండో దశలో ఏప్రిల్‌ 16న మండలస్థాయి, మూడోదశలో మే 2న నియోజకవర్గస్థాయి, నాలుగోదశలో మే 22న జిల్లాస్థాయిలో విస్త్రతంగా కార్యక్రమాలు నిర్వహించడం. ఐదోదశలో జూన్‌ 2న రాష్ట్రస్థాయిలో ఆవిర్భావ వేడుకలు అనుసంధానం చేసేలా జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా ప్రణాళిక రూపాందించారు. ఈమేరకు ఏర్పాట్లు కూడా చేశారు.

జిల్లాలోని అన్నిశాఖల సమన్వయంతో 10 కీలక అంశాల ప్రాతిపదికగా 99 రోజుల కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అవిఇవే..

పరిపాలన – పరిశుభ్రత: ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్‌ ఫైళ్ల సత్వర క్లియరెన్స్‌, పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వడం

ఆరోగ్యం : మెరుగైన వైద్య సేవలు అందరికీ అందేలా చూడడం

అరైవ్‌.. అలైవ్‌ : రహదారి భద్రత, సురక్షిత ప్రయాణంపై వాహనదారులకు అవగాహన కల్పించడం

సంక్షేమం : అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలు చేయడం ద్వారా లక్ష్యం సాధించడం

పిల్లల భద్రత– డ్రగ్స్‌కు చెక్‌ : బాలల రక్షణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ, డ్రగ్స్‌కు సంపూర్ణంగా అడ్డుకట్టవేయడం

రైతు సంక్షేమం : వ్యవసాయ రంగానికి ఊతం, రైతుల సంక్షేమానికి భరోసా కల్పించడం

విద్య : పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, విద్యా ప్రమాణాలు పెంపొందించడం

యువత–క్రీడలు : యువతకు ఉపాధి మార్గాలు, క్రీడా రంగానికి ప్రోత్సాహం

మహిళలు : మహిళా సాధికారత, రక్షణ

పర్యావరణం : పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement