పెద్దపల్లి : విద్యార్థులకు పరీక్షల కాలం మొదలైంది. ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈనెల 14 నుంచి పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తారు. ఈ సమయంలో విద్యార్థులు నిద్ర పోవడంతోపాటు పౌష్టికాహారం తీసుకుంటే పరీక్షలు బాగా రాస్తారని సైకాలజిస్ట్‌లు చెబుతున్నారు. ఏడాదంతా ఎంతోకష్టపడి చదివి.. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురికావొద్దంటున్నారు.
స్టీమ్‌రైస్‌తో భోజనం
విద్యార్థులు ఇష్టంగా తినేందుకు, సులభంగా జీర్ణమయ్యేందుకు వీలుగా మధ్యాహ్న భోజనంలో ఈనెల 2 నుంచి స్టీమ్‌రైస్ వినియోగిస్తున్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఈ బియ్యంతోనే వంట తయారు చేస్తున్నారు. ప్రతీపాఠశాలకు రైస్ అందించేలా సివిల్ సప్లయ్ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమన్వయం చేసుకుంటున్నారు.
కడుపునిండా తినేలా..
మధ్యాహ్న భోజన పథకానికి సరఫరా చేస్తున్న సన్నబియ్యం కొత్తవి. వీటిని వండితే ముద్దగా తయారవుతోంది. దీనిని తినడానికి విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. స్టీమ్‌రైస్‌తో భో జనం తయారు చేస్తే రుచికరంగా, పొడిపొడిగా ఉంటుందని, దీనిని తి నేందుకు చిన్నారులు బాగా ఇష్టపడతారని తల్లిదండ్రులు చెబుతున్నారు. అంతేకాదు.. సాధారణ బియ్యం క న్నా ఎక్కువ పోషకాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. విటమి న్– బీ, బీ–12, ఐరన్, మెగ్నీషియం లభిస్తాయని వారు అంటున్నారు.


