ధర్మారం(ధర్మపురి): ధర్మపురి ఎమ్మె ల్యే, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి ల క్ష్మణ్‌కుమార్‌కు ప్రభుత్వంలో అనూహ్యంగా కీలక పదువుల్లో చోటు ల భిస్తోంది. 2027లో నిర్వహించే గో దావరి పుష్కరాల ఏర్పాట్ల నిర్వహ ణను పర్యవేక్షించే మంత్రుల ఉపసంఘంలోనూ ఆయనకు తాజాగా చోటు లభించింది. ఈమేరకు ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది. గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అధ్యక్షతన 9 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు జీవోఆర్ నంబరు 319 విడుదల చేశారు. ఇందులో కీలక శాఖల మంత్రులకు చోటుకల్పించగా ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మణ్‌కుమార్‌నూ సభ్యుడిగా నియమించారు. ఇటీవల నిర్వహించిన మేడారం సమ్మ క్క – సారలమ్మ జాతర ఏర్పాటు పనుల్లోనూ లక్ష్మణ్‌కుమార్ కీలకపాత్ర పోషించారు.
విధేయతను వరించిన పదవులు
రాజకీయంగా అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్న లక్ష్మణ్‌కుమర్.. అసెంబ్లీ ఎన్నికల్లో అనేకసార్లు ఓటమి పాలయ్యారు. అయినా, వెరవకుండా పోటీ చేస్తూ నే వచ్చారు. 2018 ఎన్నికల్లో కేవలం 400 ఓట్ల తే డాతో ఓటమి చెందారు. అయినా, వెనక్క వెళ్లలే దు. తన రాజకీయ గురువు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్, మరోగురువు మాజీ మంత్రి జీవ న్‌రెడ్డిపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ ధర్మపురి నియోజకవర్గంలో పార్టీ ఉనికిని కాపాడారు.
నాడు, నేడూ తొలిపర్యాయమే
కాంగ్రెస్ టికెట్‌పై తొలిసారి ధ ర్మారం జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ సమయంలో ఆరెపల్లి మోహన్ ఉమ్మడి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. అదేసమయంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మానకొండూ ర్ నుంచి మోహన్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయన స్థానంలో లక్ష్మణ్‌కుమార్‌కు అనూహ్యంగా జెడ్పీ చైర్మన్ పీఠం దక్కింది. 2010 నుంచి 2012 వరకు జెడ్పీ చైర్మన్‌గా, 2013 నుంచి 2014 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్‌గా చైర్మన్‌గా వ్యవహరించారు. జెడ్పీటీసీగా తొలిసారి ఎన్నికై జెడ్పీ చైర్మన్‌గా, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా, ఓటమి నుంచి తేరుకుని తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై న వెంటనే రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో లక్ష్మణ్‌కుమార్‌కు ప్రభుత్వ విప్‌గా అవకాశం కల్పించారు. సంక్షేమ శాఖ మంత్రిగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. తా జాగా గోదావరి పుష్కర ఏర్పాట్ల సబ్ కమిటీ స భ్యుడిగా కీలకబాధ్యతలను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది. నియోజకవర్గ ప్రజలు, భగవంతుడి దయ ఉంటే తాను మరింత ఎదుగుతాననే లక్ష్మణ్‌కుమార్ మాటలు నిజంగా మారుతున్నాయని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి లక్ష్మణ్‌కుమార్


