జిల్లావ్యాప్తంగా ఎండుతున్న వేపచెట్లు డైబ్యాక్ వ్యాధి అంటున్న వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉగాది పచ్చడికి వేపపువ్వు కరువంటున్న జిల్లావాసులు
కాల్వశ్రీరాంపూర్(పెద్దపల్లి): పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకూ అమ్మవారు(ఆటలమ్మ) సోకితే వేపాకు పసరు తీసి చర్మానికి పూతపూయడం, వేపకొమ్మల్లో పడుకోబెట్టడం ఇప్పటికీ గ్రామాల్లో ఒక ఆచారంగా కొనసాగుతోంది. తద్వారా వ్యాధి నుంచి ఉపశమనం లభిస్తుందని జనాల విశ్వాసం. అంతేకాదు.. ఆయుర్వేదంలోనూ వేపను అనేక రకాలు గా వినియోగిస్తుంటారు. ఇలాంటి అనేకఔషధ గు ణాలు ఉన్న, పలు వ్యాధులను నయం చేసే శక్తి కలిగిన వేపచెట్టు(సహజ సంజీవనిగా పేర్కొనే) అంతుచిక్కని వ్యాధితో నిలువెల్లా ఎండిపోతోంది. కొమ్మలు వాలిపోయి మాడినట్లు కనిపిస్తున్నాయి.
ఉగాది పచ్చడికి వేపపువ్వు ఉండదా?
తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగకు ప్రత్యేక ఉంది. పండుగ షడ్రుచులు కలిగిన పచ్చడిలో వేపపువ్వు తప్పనిసరి. అలాంటి వేపపువ్వు ఇప్పుడు కరువు కా నుందా? అనే సంశయం ఏర్పడింది. ఎక్కడ చూసి నా వేపచెట్లు పూతపూయక ముందే.. అదికూడా ఉగాది పండుగ ముందే వైరస్‌తో నిర్జీవంగా మారుతోంది. వేసవి వచ్చిందంటే వేపచెట్టు నీడన ఉంటే ఎంతోఉపశమనం లభిస్తుంది. ఈవిషయంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, టీమస్కిటో బగ్ అనే పురుగు ఆశించి వేపచెట్టు నిలువెల్లా ఎండిపోతోందంటున్నారు. దీని నివారణకు లీటరు నీటిలో రెండు మిల్లీ లీటర్ల ప్రొఫెనోపాస్, లేదా లీటరు నీటికి ఒక గ్రాము కార్బండిజమ్ లేదా మూడు గ్రాముల ఆక్సిక్లోరైడ్ లేదా మూడు గ్రాముల కాపర్ హైడ్రాక్సి క్లోరైడ్ కలిపి చెట్టు మొత్తం తడిసేలా పిచికారీ చేయాలని వారు సూచిస్తున్నారు.


