● ఆడబిడ్డ వివాహానికి రూ.5,016 అందజేత
ఓదెల(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామపంచాయతీ సర్పంచ్ గ్యారవేని విజయ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలుచేసి గ్రామస్తుల ప్రశంసలు అందుకుంటున్నారు. తాను విజయం సాధిస్తే ఆడబిడ్డ వివాహానికి రూ.5,016 అందజేస్తానని, తన ఐదేళ్ల పదవీకాలం వరకూ ఈ పథకం నిరంతరం కొనసాగిస్తానని మేనిఫెస్టోలో వెల్లడించారు. సర్పంచ్‌గా గెలిచాక తొలిసారిగా.. గురువారం గ్రామంలో జరిగిన గుండేటి లత – రాజవీర్ల దంపతుల ఏకైక కూతురు నవ్య వివాహనికి సర్పంచ్ దంపతులు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నవదంపతులకు రూ.5,016 అందజేసి మాట నిలబెట్టుకున్నారు.
క్వింటాల్ పత్తి రూ.7,111
పెద్దపల్లిరూరల్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌యా ర్డు ఆవరణలో గురువారం పత్తి క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,111 ధర పలికింది. కనిష్టంగా రూ. 5,302, సగటు రూ.6,707గా ఉందని మార్కెట్ కా ర్యదర్శి ప్రవీణ్‌రెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి పలువురు రైతుల తీసుకొచ్చిన 476 క్వింటా ళ్ల పత్తి కొనుగోలు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.


