జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని తెలంగాణ ఎన్టీపీసీ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్ప త్తి, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్(ఈడీ) చందన్ కుమార్ సామంత అన్నారు. గురువారం జాతీ య భద్రత దినోత్సవం సందర్భంగా భద్రత జెండా ఆవిష్కరించి మాట్లాడారు. ప్రమాదరహిత సంవత్సరంగా నమోదు చేయడంలో ప్రతీ ఉద్యోగి అంకితభావంతో విధులు నిర్వ హించాలని ఆయన కోరారు. అనంతరం భద్రతపై ప్రతిజ్ఞ చేయించారు. ప్రాజెక్టు గేట్ నుంచి సర్వీసు భవనం వరకు ర్యాలీ నిర్వహించారు. జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.
ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు
పెద్దపల్లి: జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి కల్పన తెలిపారు. మొత్తం 4,306 మంది విద్యార్థులకు 4,176 మంది హాజరయ్యారని వివరించారు. 96శాతం హాజరు నమోదు అయ్యిందని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులకు సెంటర్లలో అన్ని ఏర్పాట్లు చేశామని కల్పన వివరించారు.
వ్యాయామంతో ఆరోగ్యం
పెద్దపల్లిరూరల్: వ్యాయామంతోనే ఆరోగ్యంగా ఉంటామని, వాకర్స్ కోసం జిమ్ పరికరాలను ఎమ్మెల్యే విజయరమణారావు సహకారంతో సమకూర్చామని మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని ఐటీఐ మైదానంలో గురువారం వాకర్స్ అసోసియేష న్ సభ్యులు మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు కొమ్ము సుధాకర్, కమల్, గుజ్జుల కుమా ర్, ఉప్పు స్వరూప, రాజును శాలువా, పూల మాలతో సత్కరించారు. అనంతరం మల్లయ్య మాట్లాడుతూ, దేహదారుఢ్యం, ఆరోగ్యం కో సం ఐటీఐ మైదానం ఆవరణలో ఎమ్మెల్యే చొర వతో స్విమ్మింగ్‌పూల్ నిర్మిస్తున్నామన్నారు. అ నంతరం 21వ వార్డు పరిధిలో పెండింగ్ సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించారు. టీపీవో నరేశ్, వినయ్ తదితరులు ఉన్నారు.
నేటినుంచి ప్రత్యేక వైద్యశిబిరాలు
పెద్దపల్లి: ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో శుక్రవారం నుంచి విద్యార్థినులకు వివిధ వైద్య పరీక్షలు ఉచితంగా అందిస్తారు. అవసరమైన వారికి మందులు పంపిణీ చేస్తారు. ఈనెల 30వ తేదీ వరకు ప్రత్యేక వైద్యనిపుణులు ఇందులో పాలుపంచుకుంటారు. రాఘవాపూర్ పీహెచ్‌సీలో కలెక్టర్ కోయ శ్రీహర్ష వైద్యశిబిరం ప్రారంభిస్తారని జిల్లా వైద్యాధికారి ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
కాలేజీలో యూత్ పార్లమెంట్
గోదావరిఖనిటౌన్: నగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం జిల్లాస్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాల(సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్– సిమ్స్) ప్రిన్సిపల్ నరేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆరోగ్యవంతమైన యువత సమృద్ధి కలిగిన దేశంగా త యారు చేయాలని ఆయన కోరారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జైకిషన్‌ఓజ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ప్రతినిధులు వెంకటరాంబాబు, మనోహర్, సాంబశివరావు, ఎన్‌ఎస్‌ఎస్ కేడెట్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.


