సాక్షి, పెద్దపల్లి:
విద్యార్థులు పదో తరగతిలో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా, ఏ ఒక్కరూ తప్పొద్దనే ధ్యేయంతో వార్షిక పరీక్షల విధానంలో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. గతేడాది వరకు వార్షిక పరీక్షలు ఆదివారం మినహాయించి వరుసగా జరిపేది. ఒక్కో పరీక్షకు మధ్య ఎక్కువ గడువు ఉండేది కాదు. కానీ, ఈసారి ఈనెల 14 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వరకు.. అంటే సుమారు నెలరోజుల పాటు పరీక్షలు నిర్వహించనుంది. వీటి మధ్య వచ్చిన గడువును విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా ప్రత్యేక ప్రణాళిక కూడా సిద్ధం చేసింది. దీనిని కచ్చితంగా పాటించాలని ఉత్తర్వులు జారీచేసింది. ఇందుకు అనుగుణంగా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది.
ప్రభుత్వ స్కూళ్లు
ప్రైవేట్ స్కూళ్లు
పదో తరగతి పరీక్ష వివరాలు
గతేడాది ఇలా..
‘పది’లో మెరుగైన ఫలితాల సాధనే ‘లక్ష్య’ం
ఒక్కోపరీక్షకు 3 నుంచి 5 రోజుల సమయం
ఈ గడువులో విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
వందశాతం ఉత్తీర్ణతే లక్ష్యం
పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రత్యేక కార్యాచరణతో విద్యాబోధన చేస్తున్నాం. మారిన నూతన పరీక్షల విధానంపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలి. గ్యాప్ పీరియడ్‌ను సద్వినియోగం చేసుకోవాలి. గ్యాప్ పీరియడ్‌లో ఉపాధ్యాయులు నిర్వహించే ప్రత్యేక తరగతులకు తప్పక హాజరుకావాలి. తల్లిదండ్రులు తప్పకుండా తమ పిల్లల్ని స్కూళ్లకు పంపించేలా చూడాలి.
– శారద, డీఈవో


