ఘనంగా చందనోత్సవం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా చందనోత్సవం

Mar 5 2026 7:17 AM | Updated on Mar 5 2026 7:17 AM

పెద్దపల్లిరూరల్‌: దేవునిపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం చందనోత్సవం, ప్రత్యేకపూజలు ఘనంగా నిర్వహించా రు. ప్రతీపౌర్ణమి సందర్భంగా ఈ కార్యక్ర మం చేపడతారు. ఇందులో భాగంగా అర్చకు లు శ్రీకాంతచార్యులు, రామాచార్యులు ఆధ్వర్యంలో పంచామృతాభిషేకాలు నిర్వహించా రు. భక్తులు భారీసంఖ్యలో హాజరయ్యారు.

వైభవంగా నాగవెల్లిపట్నం

యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం ఆలయ ఆవరణలో నాగవెల్లి(నాగబలి) పట్నం వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు జగన్నాథాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి ఉ దయం నుంచి రాత్రి వరకూ ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సింగరేణి ఆర్జీ–2 ఎస్‌వోటూ జీఎం రాముడు, అధికారులు, ఆల య కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

సమస్యలు పరిష్కరించాలి

ఫెర్టిలైజర్‌సిటీ(రామగుండం): రామగుండం ఫెర్టిలైజర్స్‌ కెమికల్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ కార్మికులను యాజ మాన్యం శ్రమదోపిడికి గురిచేస్తోందని ఆర్‌ఎఫ్‌సీఎల్‌ కార్మిక సంఘం అధ్యక్షుడు నెలకంటి రాము ఆరోపించారు. బుధవారం కాంట్రాక్టు కార్మికులతో కలిసి రామగుండం ఎరువుల క ర్మాగారం మెయిన్‌ గేటును ముట్టడించారు. రాము మాట్లాడుతూ.. కర్మాగారం యాజమాన్యం కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క కార్మికులను శ్రమ దోపిడీ చేస్తోందన్నారు. కర్మాగారం ప్రా రంభం నుంచి వారి సమస్యలను తుంగలో తొక్కిపెడుతోందని ఆరోపించారు. వేతనాల్లో కోత విధిస్తోందని అన్నారు. సమస్యలు పరి ష్కరించాలని ప్రశ్నిస్తే.. అది కాంట్రాక్టర్‌ బా ధ్యతేనని చేతులెత్తేస్తోందని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించి సమాన పనికి సమా న వేతనం చెల్లించడంతోపాటు, అలవెన్స్‌లు, బోనసులు అమలు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంట్రాక్ట్‌ కార్మికుల సమస్యలపై రామగుండం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌కు ఫిర్యాదు చేశామని రాము తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్నూరి శంకర్‌, కాంట్రాక్ట్‌ కార్మికులు పాల్గొన్నారు.

9 వరకు సాగునీరు విడుదల

పెద్దపల్లి: శ్రీరాంసాగర్‌ ప్రాజెక్ట్‌ కాకతీయ కాలువ డీ–83, 86ద్వారా జిల్లాకు ఐదోవిడత సాగునీటిని ఈనెల ఒకటో తేదీన విడుదల చేశారని ఇరిగేషన్‌ ఈఈ ప్రసాద్‌ తెలిపారు. ఈసారి 8రోజులపాటు.. అంటే.. ఈనెల 9వ తేదీ వరకు సాగునీరు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. చివరి ఆయకట్టుకూ సాగునీరు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని ఆయన వివరించారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

చట్టాలపై అవగాహన అవసరం

పెద్దపల్లిరూరల్‌: గ్రామ పంచాయతీ వార్డుసభ్యులకు పంచాయతీరాజ్‌ చట్టంపై పూర్తి అవగాహన అవసరమని ట్రెయినర్లు సూచించారు. బ్రాహ్మణపల్లి రైతువేదికలో ఆఖరు విడత వార్డుసభ్యుల శిక్షణ శిబిరంలో ఎంపీడీవో శ్రీనివాస్‌, ట్రెయినర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement