పెద్దపల్లిలో మహిళలు, యువతుల నృత్యం
డిప్యూటీ మేయర్‌కు రంగులు పూస్తున్న మేయర్ స్వామి
కోల్‌సిటీ/పెద్దపల్లి/పెద్దపల్లిరూరల్/జ్యోతినగర్: రంగుల పండుగ హోలీ వేడుకలు రెండోరోజు బుధవారం కూడా జిల్లాలోని పలుచోట్లు సంబురంగా జరుపుకున్నారు. మంగళవారం కొందరు వేడుకలు జరుపుకోగా.. చంద్రగ్రహణం ఉందని, ఆరోజు వేడుకల నిర్వహణ మంచిదికాదనే అభిప్రాయంతో చాలామంది పండుగకు దూరంగా ఉన్నారు. రెండోజు ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. పెద్దపల్లిలో ఏసీపీ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, పలువురు కార్పొరేటర్లు సంబురాల్లో మునిగి తేలారు.


