బైక్‌ను నడుముకు కట్టుకొని.. బావిలో దూకి..
● పెగడపల్లిలో వ్యక్తి బలవన్మరణం
పెగడపల్లి(ధర్మపురి): మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తన బైక్‌ను తాడుతో నడముకు కట్టుకొని బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిరణ్‌కుమార్ వివరాల ప్రకారం.. బండారు వెంకటేశం(50) కొంతకాలంగా తాగుడుకు బానిసయ్యాడు. శనివారం మధ్యాహ్నం తన బైకుపై బయటకు వెళ్లిన వెంకటేశం.. రాత్రి ఇంటికి రాకపోవడంతో ఆదివారం కుంటుంబ సభ్యులు వెతికారు. గ్రామ శివారులోని దాసరి పాపయ్య అనే రైతు వ్యవసాయ బావి వద్ద చెప్పులు, ఇతర వస్తువులు కనిపించాయి. బావిలో చూడగా.. బైక్‌తో సహా వెంకటేశం మృతదేహం లభించింది. మృతుడి భార్య గంగవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మృతుడికి తల్లి, తండ్రి, భార్య, ఇద్దరు కూతుళ్లున్నారు.
వేములవాడ: భీమన్నను ఆదివారం 20వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఈనెల 30న ఉదయం 3 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాల అనంతరం భీమేశ్వరాలయంలో 4 నుంచి 4.30 గంటల వరకు ఆలయ శుద్ధి, 4.30 నుంచి 5 గంటల వరకు ప్రాతఃకాల పూజ, 5.45 గంటలకు పల్లకీసేవలపై ఉత్తరద్వార ప్రవేశం ఉంటుందని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.
బైక్‌ను నడుముకు కట్టుకొని.. బావిలో దూకి..


