
ఆంజనేయరాజుకు అవార్డు
జ్యోతినగర్(రామగుండం): రామగుండంలోని ఎన్టీపీసీ సీ ఐఎస్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ ఎస్.ఆంజనేయరాజు కు ప్రతిష్టాత్మక రాష్ట్రపతి మె రిటోరియస్ సర్వీస్ పతకం లభించింది. ఆంజనేయరాజు సేవలను గుర్తించిన అధికారులు.. ఆయనను మెరిటోరియస్ సర్వీస్ మెడల్‌కు ఎంపిక చేశారు. ఆయనను సీఐఎస్‌ఎఫ్ సీనియర్ కమాండెంట్ అరవింద్ కుమార్, అధికారులు, జవాన్‌లు, ప్రాజెక్టు అధికారులు తదితరులు అభినందించారు.
‘స్వచ్ఛ సర్వేక్షణ్’ పర్యటన
ఎలిగేడు(పెద్దపల్లి): స్వచ్చ సర్వేక్షణ్ గ్రామీణ్– 2025 కేంద్ర బృందం గురువారం ధూళికట్టలో పర్యటించింది. స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రా లు, ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించింది. సేవలపై ఆరా తీసింది. ఇంకుడుగుంతలు, మరుగు దొడ్ల వినియోగం, కిచెన్ గార్డెన్‌లు, డ్రైనేజీలు తదితర వాటి ఫొటోలు తీసుకుంది. సభ్యులు వి.మధు, డి.రజిత ఎంపీడీవో భాస్కర్‌రావు, ఎంపీవో కిరణ్, ఎస్‌బీఎం కో ఆర్డినేటర్ రాఘవులు, పంచాయతీ కార్యదర్శులు పున్నమ య్య, అంజలి, ఏపీవో సదానందం, ఏపీఎం గీత, సీసీ మల్లేశం తదితరులు పాల్గొన్నారు.
సింగరేణి అధికారుల నిరసన
రామగిరి(మంథని): పెర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే (పీఆర్పీ) కోసం సింగరేణి అధికారులు మూడురోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1, 2, అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులోని వివిధ విభాగాల అధికారులు జీఎం కార్యాల యం ఎదుటట నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. సీఎంవోఏఐ నాయకులు మాట్లాడుతూ 2022–23, 2023–24 ఆర్ధిక సంవత్సరాల పీఆర్పీ ఇప్పటివరకు చెల్లించలేదన్నారు. కోల్ ఇండియాలో ఏటా చెల్లిస్తోందన్నారు. డిప్యూటి సీఎం భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు, సింగరేణి సీఎండీ బలరాం నాయక్ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కారించాలని కోరా రు. జీఎంలు సుధాకర్‌రావు, నాగేశ్వరరావు, అధికారుల సంఘం నేతలు వెంకటరమణ, శ్రీనివాస్‌రావు, సుదర్శనం పాల్గొన్నారు.
బీజేపీ తిరంగా యాత్ర
పెద్దపల్లిరూరల్: బీజేపీ ఆధ్వర్యంలో గురువా రం జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర నిర్వహించారు. కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ప్రగతినగర్ చౌరస్తా నుంచి కమాన్ వరకు యాత్ర కొనసాగింది. నాయకులు ఠాకూర్ రాంసింగ్, జంగ చక్రధర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, పల్లె సదానందం, ఫహీం, క్రాంతి, లక్ష్మీనారాయణ, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
పదవీకాలం పొడిగింపు
సుల్తానాబాద్(పెద్దపల్లి): ప్రాథమిక వ్యవసా య సహకార సంఘాల పదవీకాలం మరో ఆ ర్నెల్లపాటు పొడిగించినట్లు ఉత్తర్వులు జారీ అ య్యాయని డీసీవో శ్రీమాల తెలిపారు. పీఏసీఎ స్ పదవీకాలం గురువారం ముగిసిందన్నారు. దీంతో పీఏసీఎస్‌ల పదవీకాలం పొడిగిస్తూ సర్కార్ ఉత్తర్వులు ఇచ్చిందని వివరించారు.
ప్రభుత్వ ఆస్పత్రికి మహర్దశ
మంథని: స్థానిక ప్రభుత్వ సామాజిక వైద్యశాలకు మహర్దశ పట్టనుంది. సౌకర్యాల కల్పన, డాక్టర్ల నియామకం, పలు అభివృద్ధి పనులకు రూ.20లక్షలు మంజూరు కావడంతో ఆస్పత్రి రూపురేఖలు మారుతాయని జిల్లా మెడికల్ సూపరింటెండెంట్ శ్రీధర్ తెలిపారు. ఇద్దరు డాక్టర్ల నియామకం, రూ.5లక్షలతో వెయిటింగ్‌హాల్ నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. మాతాశిశు ఆస్పత్రిలో గర్భిణుల కోసం రూ.12లక్షలతో అల్ట్రా సౌండ్ స్కానింగ్, శిశువు ల కోసం రూ.1.12లక్షలతో వార్నర్, ఫొటో థె రపీ, రూ.1.80లక్షలతో ఆర్‌వో ప్లాంట్ ఏర్పా టు చేస్తామన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ఆదేశాలతో కలెక్టర్ నిధులు మంజూరు చేశారన్నారు.
రేపు ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు
జ్యోతినగర్(రామగుండం): జిల్లాస్థాయి ఎస్జీఎ ఫ్ క్రీడా ఎంపిక పోటీలు ఈనెల 16న నిర్వహించనున్నట్లు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి కనుకుంట్ల లక్ష్మణ్ తెలిపారు. ఎన్టీపీసీ జెడ్పీ హైస్కూల్‌లో అండర్–15లో వాలీబాల్, ఫుట్ బాల్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.

ఆంజనేయరాజుకు అవార్డు

ఆంజనేయరాజుకు అవార్డు