
ప్రజలు ఏకతాటిపైకి రావాలి
● రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని: న్యాయ సమ్మతమైన ఎన్నికల కోసం ప్రజలు ఏకం కా వాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ కోరారు. స్థాని క ప్రధాన చౌరస్తాలో గురువారం రాత్రి కొ వ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ‘ఓట్ల దొంగలు – గద్దె దిగండి’ అంటూ నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యంలో పవిత్రమైన ఓటును దోచుకునే వారికి రాజకీయాల్లో స్థానం ఉండవద్దని అన్నారు. నాయకులు మహంకాళి స్వామి, బొంతల రాజేశ్, తిప్పారపు శ్రీనివాస్, ప్రకాశ్ పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
పాలకుర్తి(రామగుండం): గ్రామాల అభివృద్ధే ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ అన్నారు. బసంత్‌నగర్, పాలకుర్తి, ఈసాలతక్కళ్లపల్లి, కొత్తపల్లి, రామారావుపల్లి, పుట్నూర్, జయ్యారం, కుక్కలగూడూర్, వేంనూర్ గ్రామాల్లో చేపట్టిన రోడ్లు, తదితర అభివృద్ధి పనులకు తన సతీమణి మనాలీ ఠాకూర్‌తో కలిసి గురువారం భూమిపూజ చేశారు. కొత్త రేషన్ కార్డులు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ప్రతీ సంక్షేమ పథకం అర్హులైన ప్రతీఒక్కరికి అందిస్తామన్నారు. నాయకులు తిరుపతి, మనోహర్‌రెడ్డి, రమేశ్, శ్రీనివాస్, సూర సమ్మయ్య, పర్శవేని శ్రీనివాస్, తంగెడ అనిల్‌రావు, తలారీ శంకర్, శిలగాని రాజేశం, మల్లెత్తుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
రామగుండం: అంతర్గాం, రామగుండంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కుందనపల్లి అర్బన్ పార్క్‌లోని అటవీశాఖ జిల్లా నివాసాన్ని ప్రారంభించారు.