
రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’
మంథని/గోదావరిఖనిటౌన్/పాలకుర్తి/పెద్దపల్లిరూరల్/కమాన్‌పూర్/: రాజ్యాంగ స్ఫూర్తితో ప్రజాసంక్షేమం ఎజెండాగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా మంథని పట్టణంతోపాటు ముత్తారంలోని వివిధ ప్రాంతాల్లో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ కోయ శ్రీహర్ష తదితరులు హాజరయ్యారు. తొలుత అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఆవిర్భవించడంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చేసిన కృషి ఎంతో ఉందన్నారు. జిల్లా కేంద్రంలో అంబేడ్కర్‌కు నివాళి అర్పించిన పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ.. ఆ తర్వాత అమర్‌నగర్‌లోని ఓ హోటల్ వద్ద టీతాగారు. మంథని, కమాన్‌పూర్, ధర్మారం తదితర మండలాల్లో జరిగిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సభల్లో పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు జిల్లా కేంద్రంతోపాటు ఎలిగేడు, జూలపల్లి, సుల్తానాబాద్ తదితర మండలాల్లో అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్‌లో సీపీ అంబర్ కిశోర్ ఝా, గోదావరిఖని జీఎం ఆఫీసు గ్రౌండ్‌లో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్, ఆర్జీ–1 జీఎం లలిత్‌కుమార్, రామగుండం ఎన్టీపీసీ ప్రాజెక్టులో జనరల్ మేనేజర్ అలోక్ కుమార్ త్రిపాఠి, ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో సీజీఎం ఉదయ్ రాజహంస తదితరులు అంబేడ్కర్‌కు నివాళి అర్పించారు. ఎన్టీపీసీ మేడిపల్లి సెంటర్‌లో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్ తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లోనూ ఆయన పాల్గొని ప్రసంగించారు. నాయకులు పాల్గొన్నారు.

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’

రాజ్యాంగ స్ఫూర్తితోనే‘ప్రజాపాలన’