వెల్గటూర్: ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామానికి చెందిన అరిగెల వైశాలి జాతీయస్థాయి హ్యాండ్‌బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ నెల 9న హ్యాండ్‌బాల్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో జరిగిన సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికై నట్లు కరీంనగర్ జిల్లా హ్యాండ్‌బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు వడ్లూరి రాజేందర్, జిట్టబోయిన శ్రీను తెలిపారు. ఈ నెల 26 నుంచి 29వరకు యూపీలోని లక్నోలో జరిగే 47వ జాతీయస్థాయి పోటీల్లో పాల్గొననుంది. ఎండపల్లి నుంచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికవడంపై మాజీ ఎంపీపీ శ్రీనివాసరావు, సాన యాదిరెడ్డి, ఎంఈవో రాంచంద్రం, వెంకటరమణారెడ్డి వైశాలిని అభినందించారు.


