
గంజాయి నియంత్రణకు పటిష్ట నిఘా
● పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ
గోదావరిఖని: గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా ఉంచాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝూ సూచించారు. కమిషనరేట్‌లోని పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో మంగళవారం ఆయన తన కార్యాలయంలో నేర సమీక్ష నిర్వహించారు. పోలీస్ అధికారులు చట్టబద్ధంగా పనిచేయాలని సీపీ సూచించారు. వివిధ కార్యకలాపాలపై ముందస్తు సమాచారం ఉండాలని, ప్రతీ కేసులో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించాలని అన్నారు. ఎస్సీ ఎస్టీ కేసుల్లో న్యాయపరంగా, పారదర్శకంగా విచారణ జరపాలని తెలిపారు. అనంతరం గంజాయి స్వాధీనం కేసుల్లో ప్రతిభ కనబరిచిన అధికారులు, సిబ్బందికి సీపీ రివార్డులు అందజేశారు. మంచిర్యాల, పెద్దపల్లి డీసీపీలు భాస్కర్, కరుణాకర్, అడిషనల్ డీసీపీ(అడ్మిన్) రాజు, స్పెషల్ బ్రాంచ్, గోదావరిఖని, పెద్దపల్లి, ట్రాఫిక్, ఏఆర్ ఏసీపీలు రాఘవేంద్రరావు, రమేశ్, కృష్ణ, మల్లారెడ్డి, ప్రతాప్, ఏవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.