
సీఎంపై ఠాణాలో ఫిర్యాదు
గోదావరిఖని: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అను చిత వాఖ్యలు చేశారని పేర్కొంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై స్థానిక మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆ ధ్వర్యంలో శనివారం గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఆర్‌ఎస్ నాయకత్వా న్ని రెచ్చగొట్టేలా ఆయన వాఖ్యలు ఉన్నాయని ఫి ర్యాదులో పేర్కొన్నారు. సీఎంపై కఠిన చర్యలు తీ సుకోవాలని అందులో కోరారు. ఈమేరకు ఎస్సై భూమేషన్‌కు ఫిర్యాదు పత్రం అందజేశారు. నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
బ్యాంకింగ్ రంగంలో ఉచితశిక్షణ
పెద్దపల్లిరూరల్: డిగ్రీ ఉత్తీర్ణులైన వెనుకబడిన తరగతులకు చెందిన వారికి బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ వెల్ఫేర్ ఆఫీ సర్ రంగారెడ్డి తెలిపారు. హైదరాబాద్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ట్రెయినింగ్ ఇనిస్టిట్యూట్ ద్వారా శిక్షణ ఇస్తారన్నారు. డిగ్రీ పూర్తిచేసి 26ఏళ్లలో పు వయసు గలవారు అర్హులన్నారు. ఆసక్తి, అర్హత గలవారు ఏప్రిల్ 8లోగా దరఖాస్తు చేసుకోవాలన్నా రు. అదేనెల 12న ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ కరీంనగర్‌లో నిర్వహిస్తామని, వివరాలకు 0878–2268686 నంబరులో సంప్రదించాలని సూచించారు.
స్కూళ్లలో ఏఐ విద్యాబోధన
రామగుండం: జిల్లాలోని వివిధ ప్రభుత్వ పాఠశాల ల్లో శనివారం ఏఐ సాయంతో విద్యాబోధన ప్రారంభమైంది. ఆబాది రామగుండం, మల్యాలపల్లి ప్రాథమిక పాఠశాలల్లో కృత్రిమ మేథ(ఏఐ)విద్యా బోధనకు ఉపాధ్యాయులు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎంఈవో చంద్రయ్య, కాంప్లెక్స్ హెచ్‌ఎం అజ్మీరా శారద, పాఠశాల హెచ్‌ఎం శ్రీనివాస్ ప్రారంభించారు. చదవులో వెనుకబడిన విద్యార్థులను ప్రాథమిక స్థాయిలోనే ఏఐ సాయంతో విద్యా బోధన చేయడం ద్వారా కనీస విషయ పరిజ్ఞానం పెంపొందుతుందని ఉపాధ్యాయులు వివరించారు.

సీఎంపై ఠాణాలో ఫిర్యాదు