జగిత్యాల: సివిల్ సర్వీసెస్ లాంగ్ టర్మ్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష కోసం ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ వెల్ఫేర్ అభివృద్ధి అధికారి సాయిబాబా తెలిపారు. జిల్లాలో డిగ్రీ పాసైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు జూలై 3 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జూలై 7న ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందని తెలిపారు. అభ్యర్థులు ప్రవేశం పొందితే లాడ్జింగ్, భోజనం, రవాణా ప్రయోజనం కోసం నెలకు రూ.5వేలు ఇవ్వడం జరుగుతుందని, బుక్‌ఫండ్ నిమిత్తం మరో రూ.5 వేలు ఇవ్వడం జరుగుతుందన్నారు.