సన్నగిల్లుతున్న ఆత్మవిశ్వాసం | Sakshi
Sakshi News home page

సన్నగిల్లుతున్న ఆత్మవిశ్వాసం

Published Sun, May 19 2024 7:35 AM

సన్నగిల్లుతున్న ఆత్మవిశ్వాసం

గోదావరిఖని: కొందరి అనాలోచిత చర్యలతో ఆత్మ విశ్వాసం సన్నగిల్లి అధికారులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని సీఎంవోఏఐ కేంద్ర కమిటీ ఉపా ధ్యక్షుడు పొనుగోటి శ్రీనివాస్‌ అన్నారు. ఆర్జీ–1 జీ ఎం శ్రీనివాస్‌ ద్వారా సింగరేణీ సీఎండీని ఉద్దేశించి శనివారం ఒక వినతిపత్రం అందజేశారు. గత ఆర్థిక సంవత్సరంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు సమష్టిగా శ్రమించి 70 మిలియన్‌ టన్నుల బొగ్గు లక్ష్యం సాధించారని తెలిపారు. ఇందులో భాగస్వాములైన అధికారులు, ఉద్యోగులను పేరుపేరునా అభినందించారని పేర్కొన్నారు. అంకితభావంతో పనిచేసేవారికి అండగా ఉంటానని మనోధైర్యం ఇచ్చారని గుర్తుచేశారు. కానీ పనిస్థలాల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని ఆవేదన చెందారు. ప్రధానంగా సింగరేణి థర్మల్‌పవర్‌ ప్లాంట్‌ డీవైఎస్‌ఈ కిరీటి.. పనిఒత్తిడి, విజిలెన్స్‌ విచారణ పేరిట జరిగే వేధింపులతో మరణిస్తున్నట్లు సూసైడ్‌ నోట్‌ రాసి ఈనెల 17న చనిపోయాడన్నారు. అధికారుల సంఘం తరఫున తాము దీనిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు. వసతులు లేకున్నా సంస్థ కో సం, అహర్నిశలు శ్రమిస్తున్న అధికారుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా తీసుకునే అనాలోచిత చర్యలతో తమ ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని, ఇది బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకతపై తీవ్రప్రభావం చూపు తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంపై విచారణ జరిపించి తప్పు చేసిన వారిపై చర్యలు తీ సుకోవాలని డిమాండ్‌ చేశారు. సుదీర్ఘ కాలంగా వి జిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వారిని బదిలీ చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారి లో ఎస్‌వోటూ జీఎం రాంమోహన్‌, ప్రతినిధులు మల్లేశం, పేరుమాళ్ల శ్రీనివాస్‌, మల్లేశ్‌, రావుల దామోదర్‌, అన్వేశ్‌, ఏజెంట్‌ చిలక శ్రీనివాస్‌, చంద్ర శేఖర్‌, సాంబశివరావు, కట్ట శ్రీధర్‌, శ్రావణ్‌కుమార్‌, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. అధికా రి కిరీటి మృతికి కార్యాలయ అధికారులు రెండు ని మిషాలపాటు మౌనం పాటించారు.

సీఎండీ స్పందించాలి

తమ సమస్యలపై సింగరేణి సీఎండీ తక్షణమే స్పందించాలని కోరుతూ ఆర్జీ–2 అధికారుల సంఘం నాయకులు కోరారు. ఈమేరకు ఆ ర్జీ–2 జీఎం ఎల్‌వీ సూర్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. బొ గ్గు ఉత్పత్తి, ఉత్పాదకత కోసం పనిచేస్తున్న అధికా రులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని, ఈవిషయంలో మనోస్థైర్యం పెంపొందించాలని కోరా రు. వినతిపత్రం అందజేసిన వారిలో నాయకులు మధుసూదన్‌, రాంరెడ్డి, నరేశ్‌, జనార్దన్‌, సుగుణాకర్‌, నితిన్‌కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం కిరీటి ఆత్మశాంతి కోసం మౌనం పాటించారు.

అధికారుల సంఘం కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement