
వేగంగా ధాన్యం కొనుగోలు
పెద్దపల్లిరూరల్: జిల్లాలో చేపట్టిన ధాన్యం కొ నుగోళ్లలో వేగం పెంచాలని అడిషనల్ కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్‌లాల్ సూచించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్‌లోని ధాన్యం నిల్వలను ఆయ న శనివారం పరిశీలించారు. రైతులు, నిర్వాహ కులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా కొనుగోళ్ల ప్రక్రియ పూర్తికావాలని ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలని సూచించారు. వర్షాలకు ధాన్యం తడవకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఏర్కొన్నారు. సివిల్ సప్లయి డీఎం శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భూసేకరణ ప్రగతిపై సమీక్ష
మంథని: గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేలో భాగంగా మంచిర్యాల–వరంగల్ మధ్య మంథని డివిజ న్ నుంచి తొలి ప్యాకేజీలో చేపట్టే జాతీయ రహ దారి నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ప్రగతిపై మంథని ఆర్డీవో హనుమా నాయక్ శనివారం సమీక్షించారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో ఆర్ అండ్ బీ, ఆర్‌డబ్ల్యూఎస్‌తోపాటు తహసీల్దార్లతో చర్చించారు. పెండింగ్ పనులపై తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. మంథని, ముత్తారం, రామగిరి తహసీల్దార్లు రాజయ్య, రాంచందర్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.
‘విద్యానిధి’కి దరఖాస్తుల ఆహ్వానం
పెద్దపల్లిరూరల్: జిల్లాకు చెందిన గిరిజన విద్యార్థులు(విదేశాల్లో చదివేవారు) ఈనెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి జనార్దన్ శనివారం తెలిపారు. విదేశాల్లో మాస్టర్స్‌స్థాయి పీహెచ్‌డీ, డాక్టోరల్ రీసెర్చ్ ప్రోగ్రాం చదవాలనుకునే గిరిజన వి ద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు కేంద్రప్రభుత్వం ఉపకారవేతనా లు అందిస్తుందని వివరించారు. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘ఎల్లంపల్లి’లోకి ఇన్‌ఫ్లో
రామగుండం: పలుచోట్ల కురుస్తున్న అకాలవ ర్షాలతో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో స్వల్పంగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థా యి నీటి మట్టం 148 అడుగులు కాగా, నీటి ని ల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలు. శనివారం నీటిమట్టం 140.68 అడుగులకు చేరగా, నీటి నిల్వ సామర్థ్యం 5.69 టీఎంసీలుగా నమోదైందని నీటి పారుదల శాఖ అధికారులు తెలిపా రు. ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, హైదరాబాద్ ప్రజల తాగునీటి అవసరాలకు 329 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులోకి 523 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది.
మే పుష్పం.. ఎంతో అందం
రామగుండం: స్థానిక రైల్వేస్టేషన్ ఏరియాకు చెందిన ఇల్లందుల శ్రీనివాస్‌కు ఇంట్లో మే పుష్పం శనివారం వికసించింది. ఏటా మేలోనే పూసే పుష్పం.. చాలా అందంగా ఉండడంతో స్థానికులు వచ్చి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
పెద్దపల్లిరూరల్: రాష్ట్రప్రభుత్వం హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గుంటి సామ్రాజ్యం డిమాండ్ చేశా రు. హమాలీలకు పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు వర్తింపజేయాలన్నారు. జిల్లా కేంద్రంలో శనివా రం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడా రు. రైల్వే గూడ్స్‌షెడ్, రైస్‌మిల్లులు, గోదాములు, మార్కెట్ యార్డులు, ఐకేపీ సెంటర్లతోపాటు వివిధ ప్రాంతాల్లో పనిచేసే హమాలీల కు ఉద్యోగ భద్రత కరువైందన్నారు. బస్తాలు మోస్తూ అవస్థలు పడుతున్న కార్మికుల సంక్షే మం కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గతంలో నిరక్షరాస్యులే హమాలీ పని చేసే వారని, ఇపుడు కుటుంబ పోషణ కోసం విద్యావంతులు సైతం హమాలీగా పని చేయా ల్సి వస్తోందని పేర్కొన్నారు. పొరుగురాష్ట్రాల నుంచి వచ్చిన హమాలీలతో పోటీ పెరిగి, య జమానులు తక్కువ కూలీలకే పనులు చేయించుకుంటూ స్థానిక హమాలీలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన చెందారు.

వేగంగా ధాన్యం కొనుగోలు

వేగంగా ధాన్యం కొనుగోలు