
నియామకపత్రం అందిస్తున్న సురేందర్‌చారి
సుల్తానాబాద్(పెద్దపల్లి): ఐక్యంగా నిలిస్తేనే రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా నిలదొక్కుకో గలుగుతామని విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుడు భీమోజు సురేందర్‌చారి అ న్నారు. శనివారం మండల కేంద్రంలోని వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విశ్వబ్రాహ్మణులను గుర్తించిన వారికే ప్రాధాన్యత ఇస్తామని వివరించారు. ప్ర భుత్వం చొరవ తీసుకొని విశ్వబ్రాహ్మణులు చేస్తు న్న వ్యాపారాలపై దాడులను ఆపాలని కోరారు. అనంతరం సుల్తానాబాద్ మండల నూతన కమిటీని ప్రకటించారు. విశ్వబ్రాహ్మణ, విశ్వకర్మ ఐక్య సంఘం మండల అధ్యక్షుడిగా సుద్దాల గ్రామానికి చెందిన ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా కాట్నపల్లి గ్రామానికి చెందిన కోరుట్ల కృష్ణాచారిని నియమించారు. నూతన కమిటీని సన్మానం చేశారు. వీరి పదవీకాలం మూడేళ్లు ఉంటుందని నియామకపత్రంలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment