సాక్షి, పెద్దపల్లి : పరీక్షలు సజావుగా సాగేందుకు, అల్లర్లు, గొడవలు జరిగినప్పుడు, సభలు, పోలింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం 144 సెక్షన్ అమలు చేస్తున్నామని అధికారులు తరచూ ప్రకటిస్తుంటారు. అయితే, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు ముందుగా ఉపయోగించే అస్త్రమే 144 సెక్షన్. భారత శిక్షాస్మృతి 144 ప్రకారం ఒక సంఘటన ప్రజలకు అసౌకర్యం కలిగించేదైనా, పెద్దఎత్తున గొడవలు జరుగుతున్నా, కుల, మత సంబంధ ఘర్షణలు తలెత్తినా, అలాంటి అవకాశం ఉన్నా 144 సెక్షన్ విధిస్తారు. ఇది అమలులో ఉన్నప్పుడు నిర్దేశిత ప్రాంతంలో నలుగురు, అంతకంటే ఎక్కువ మంది గుమిగూడితే నేరం. నేరం రుజువైతే రెండేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. కొన్ని సందర్భాల్లో రెండూ విధించవచ్చు.