ఆరుతడికి నీరిస్తారా? | - | Sakshi
Sakshi News home page

ఆరుతడికి నీరిస్తారా?

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

ఆరుతడికి నీరిస్తారా?

రబీసాగుకు సమాయత్తమవుతున్న రైతులు

సాగునీటి విడుదలపై వీఆర్‌ఎస్‌

అధికారులు ప్రకటన విడుదల చేయాలని కోరుతున్న రైతులు

మక్కువ: వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టు కాలువల ద్వారా ఈ ఏడాది రబీ సీజన్‌ ఆరుతడి పంటలకు సాగునీరు అందిస్తారా.? పనుల పేరిట గత ఏడాది మాదిరిగా గెడ్డల్లోకి నీరువదిలేస్తారా.? ఏదో ఒక విషయంపై ఇరిగేషన్‌ అధికారులు ప్రకటన విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. ఇప్పటికే వరి పంట కోత దశకు చేరుకోవడంతో, పలు ప్రాంతాల్లో వరిచేలు రైతులు కోత కోస్తున్నారు. దీంతో ఆరుతడి పంటల సాగుకు సమాయత్తమవ్వాలో, అపరాలు చల్లుకోవాలో అర్థం కాక రైతులు మధనపడుతున్నారు. గత ఏడాది వేసవికాలంలో వీఆర్‌ఎస్‌ ప్రాజెక్టు పరిధిలోని పలుచోట్ల పనులు చేపట్టడంతో, వెంగళరాయ సాగర్‌ ప్రాజెక్టులో నిల్వ ఉన్న నీటిని ఇరిగేషన్‌ అధికారులు సువర్ణముఖి, గోముఖి నదుల్లోకి విడిచిపెట్టారు. ఎల్‌నినో ప్రభా వంతో ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో సకాలంలో వర్షాలు కురవకపోవడం, వీఆర్‌ఎస్‌ కాలువల ద్వారా నీరు రాకపోవడంతో చాలా ప్రాంతాల్లో ఉభాలు జరపలేక రైతులు బీడు భూములుగా విడిచిపెట్టా రు. మరికొన్ని ప్రాంతాల్లో నారుమడులు తయారు చేసినప్పటికీ, రైతులు పంటలు సాగు చేయలేకపోయారు. ఈ ఏడాది రబీ సీజన్‌లో అయినా ఆరుతడి పంటలు సాగు చేసుకుని, కొంత నష్టాన్ని పూడ్చుకుందామని రైతులు ఆశపడుతున్నారు. అర్నాబ్‌, మురుసు తుఫాన్‌ల ప్రభావంతో వెంగళరాయ సాగ ర్‌ ప్రాజెక్టులో నీరు అత్యధికంగా నిల్వ ఉన్నందున, ఈ ఏడాది రబీ సీజన్‌లో ఆరుతడి పంటలకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement