మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఒత్తిడా? | - | Sakshi
Sakshi News home page

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఒత్తిడా?

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

మరణించిన విద్యార్థుల తల్లిదండ్రులపైనే ఒత్తిడా?

గుమ్మలక్ష్మీపురం మండలంలో గతంలో ఓ విద్యార్థి మృతి చెందిన సందర్భంలోనూ అతని తల్లిదండ్రుల నుంచి పూచీకత్తు పత్రం రాయించుకున్నారు. అప్పట్లో ఈ వ్యవహారంపై విమర్శలు వ్యక్తమైనప్పటికీ అధికారుల తీరులో మార్పు కనిపించడం లేదన్న విమర్శలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఇదే మండలంలోని పి.ఆమిటి గిరిజన సంక్షేమ పాఠశాలలో తాజాగా విద్యార్థిని మృతి చెందిన ఘటనలోనూ ఆమె తండ్రి నుంచి సంత కం తీసుకున్నారు పాఠశాల యాజమాన్యం, వా ర్డెన్‌, ఇతర సిబ్బంది తప్పేమీ లేదని.. విద్యార్థిని ఎవరి అనుమతీ లేకుండా పాఠశాల నుంచి వెళ్లి పోయిందని, చదువుపై ఆసక్తి లేక ఆత్మహత్యకు పాల్పడిందని ఆ లేఖలో రాయించారు. ఈ పరిణామాలపై గిరిజన సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులెవరో తేల్చాల్సిన సమయంలో, ముందుగానే పాఠశాల సిబ్బందికి క్లీన్‌చిట్‌ ఇచ్చేలా కుటుంబ సభ్యుల నుంచి రాతపూర్వక ప్రకటనలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement