మండల ఎన్నికలకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

మండల ఎన్నికలకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు

Nov 19 2026 1:01 AM | Updated on Nov 19 2026 1:01 AM

మండల ఎన్నికలకు పటిష్ట పోలీస్‌ బందోబస్తు రెండో విడత నామినేషన్లు ప్రారంభం 1,177 సర్పంచ్‌ నామినేషన్లు ఆమోదం

డ్రోన్‌, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఎస్పీ మాధవ్‌ రెడ్డి

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. రెండో దశలో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని భామిని, పాలకొండ, సీతంపేట, వీరఘట్టం మండలాలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలిరోజు సర్పంచ్‌ స్థానాల కు మొత్తం 59, వార్డు సభ్యుల స్థానాలకు 104 నామినేషన్లు దాఖలయ్యాయి.

మండలాలవారీ తొలిరోజు

నమోదైన నామినేషన్ల వివరాలు

మండలం సర్పంచ్‌ వార్డు

స్థానం సభ్యులు

భామిని 18 38

పాలకొండ 07 11

సీతంపేట 19 26

వీరఘట్టం 15 29

సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన విషయం విదితమే. బుధవారం వాటి పరిశీలన పూర్తి కాగా తొలివిడతలో గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, బలిజిపేట, పార్వతీపురం, సీతానగరం మండలాల్లోని 226 సర్పంచ్‌ స్థానాలు, 2,116 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో నామినేషన్ల పరిశీలన అనంతరం అంతా సవ్యంగా ఉన్న 1,177 సర్పంచ్‌, 3,988 వార్డు సభ్యుల నామినేషన్లను అధికారులు ఆమోదించారు.

పార్వతీపురం రూరల్‌: జిల్లాలోని మండల కార్యాలయాల్లో గురువారం జరగనున్న మండ ల పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడి ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట పోలీస్‌ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ఎస్‌.వి. మాధవ్‌ రెడ్డి తెలిపారు. ఎన్నికైన ఎంపీటీసీ సభ్యులు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా వినియోగించుకునేలా ముందస్తు భద్రతా ప్రణాళిక రూపొందించామన్నారు. ఎన్నికల కేంద్రాల పరిసరాల్లో డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడంతో పాటు మొబైల్‌ పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అనుమతి లేని వ్యక్తులు లోపలికి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

సమావేశ ప్రదేశం, ప్రవేశ మార్గాలు, పార్కింగ్‌ ప్రాంతాల వద్ద ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ సూచించారు. గుంపులుగా చేరడం, వాగ్వాదాలు, ఘర్షణలకు పాల్పడడం లేదా ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించా రు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాల ను సిద్ధంగా ఉంచి, ఎన్నికల అధికారులతో సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలని పోలీస్‌ సిబ్బందికి ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement