పంచాయతీ ఎన్నికలలో నిబంధనల మార్పు
ఓటర్లకు కలెక్టర్ సూచనలు
పార్వతీపురం: రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి చెరగని సిరా గుర్తు వేయనున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికా రి డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సిరా గుర్తు వేసే విధానంలో మార్పు చేసినట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపా రు. గత ఎన్నికలలో ఓటర్ల వేలికి వేసిన సిరా గుర్తులు ఇంకా పూర్తిగా తొలగిపోకపోవడంతో, ఓటింగ్ సమయంలో ఎలాంటి గందరగోళం తలెత్తకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈసారి జిల్లాలోని ఓటర్లు, ఎన్నికల విధులలో పాల్గొనే పోలింగ్ సిబ్బంది సిరా గుర్తుపై చేసిన మార్పును గమనించి, నిబంధనలపై పూర్తి అవగా హన కలిగి ఉండాలని సూచించారు. ప్రజందరూ ఎన్నికల నిబంధనలను పాటిస్తూ, తమ ఓటు హక్కును బాధ్యతాయుతంగా వినియోగించుకోవా లని కలెక్టర్ పిలుపునిచ్చారు.
తుఫాన్ హెచ్చరికపై అప్రమత్తమైన
జిల్లా యంత్రాంగం
బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్ తుఫాన్ ప్రభా వంతో రాగల మూడు రోజులు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురి సే అవకాశం ఉందని కలెక్ట ర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి తెలిపారు. తుఫాన్ ప్రభా వం నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైందన్నారు. నవంబర్ 19న జిల్లాలో అత్యధికంగా 77.81మి.మీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, 11 మండలాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొన్నారు. 231 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో భారీ వర్షాలు, మరో 10 సచివాలయాల పరిధిలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 43నుంచి 49 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నా రు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, రైతులు పంటల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదురైనా, అత్యవసర సహాయం అవసరమైనా ఫోన్ 08963450347 కంట్రోల్ రూమ్ నంబర్‌కు పోన్ చేయాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు అవసరమైన సహయ సహకారాలు అందించాలని ఆదేశించారు.


