ప్రోత్సాహకాల మాటున.. పల్లెల్లో పదవుల బేరం! | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహకాల మాటున.. పల్లెల్లో పదవుల బేరం!

Nov 14 2026 12:29 AM | Updated on Nov 14 2026 12:29 AM

–8లో ప్రోత్సాహకాల మాటున.. పల్లెల్లో పదవుల బేరం!

న్యూస్‌రీల్‌

ఏకగ్రీవ పంచాయతీలకు రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు నజరానా సర్పంచ్‌ పదవుల కోసం గ్రామాల్లో ముమ్మర ప్రయత్నాలు గ్రామదేవతల ఉత్సవాలు, అభివృద్ధి పనుల పేరుతో ఆఫర్లు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి పరీక్ష

–8లో

సుగర్‌ వ్యాధితో.. ‘ఐ’బాబోయ్‌..!

మారుతున్న జీవనశైలికి అనుగుణంగా మన ఆరోగ్యంతోపాటు కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే చక్కెర వ్యాధిని అదుపులో

ఉంచుకోవాలి.

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

సాక్షి, పార్వతీపురం మన్యం:

పల్లె పాలనలో ప్రజాస్వామ్య స్ఫూర్తి వెల్లివిరియాల్సిన వేళ.. సర్పంచ్‌ పదవుల చుట్టూ రాజకీయ సమీకరణలు, ఆర్థిక ప్రలోభాల ఆరోపణలు తెరపై కి వస్తున్నాయి. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ఏకగ్రీవ పంచాయతీలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం భారీగా నగదు ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ ప్రోత్సాహకాలు కొన్నిచోట్ల పదవుల కోసం జరుగుతున్న బేరసారాలకు వేదికవుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల మద్దతుతో నాయకు డిని ఎన్నుకోవాల్సిన పరిస్థితుల్లో.. డబ్బు, హామీల ప్రభావంతో ఏకగ్రీవాల ప్రయత్నాలు సాగుతున్నా యన్న ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. తొలిదశ పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నోటిఫికేషన్‌ వెలువడటంతో పల్లెల్లో ఎన్నికలవేడి మొదలైంది. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు ప్రభు త్వం ప్రకటించిన ప్రోత్సాహకాలు కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి. జనాభా ప్రాతిపదిక న కనిష్ఠంగా రూ.15 లక్షలు, గరిష్ఠంగా రూ.50 లక్ష ల వరకు ప్రోత్సాహకం అందించనున్నట్లు ప్రకటించింది. 5 వేలలోపు జనాభా ఉన్న పంచాయతీలకు రూ.15 లక్షలు, 5,001 నుంచి 10 వేలలోపు జనా భా ఉన్నవాటికి రూ.25 లక్షలు, 10 వేలకుపైగా జనాభా ఉన్న పంచాయతీలకు రూ.50 లక్షలు ఇవ్వనుంది. గతంలో ఈ మొత్తాలు గరిష్ఠంగా రూ.20 లక్షలకే పరిమితమయ్యేవి. తాజా పెంపుతో ఏకగ్రీ వ పంచాయతీలకు అందే ప్రోత్సాహకం గణనీయంగా పెరిగింది.

ప్రోత్సాహకాల చుట్టూ రాజకీయాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో మొత్తం 451 గ్రామ పంచాయతీలు ఉండగా.. రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో గ్రామాల్లో సర్పంచ్‌ పదవు లను దక్కించుకునేందుకు ఆశావహులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఏకగ్రీవాల ద్వారా పదవులను చేజిక్కించుకోవాలన్న ప్రయత్నాలు కొన్ని గ్రామాల్లో జోరందుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామదేవతల ఉత్సవాల ను ఘనంగా నిర్వహిస్తామని, పంచాయతీ అభివృద్ధికి లక్షల రూపాయల విరాళాలు అందిస్తామని కొందరు ముందుకొస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తు న్నాయి. రాష్ట్రంలో తమ ప్రభుత్వమే అధికారంలో ఉందని, ఏకగ్రీవంగా సర్పంచ్‌ పదవిని అప్పగిస్తే గ్రామానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామంటూ ప్రజలకు హామీలు ఇస్తున్నట్లు సమాచారం. గ్రామదేవతల పండగలకు భారీ నజరానాలు ప్రకటించడం, గ్రామాభివృద్ధి పేరుతో విరాళాల ఆఫర్లు ఇవ్వడం వెనుక సర్పంచ్‌ పదవిని ఏకగ్రీవంగా దక్కించుకోవాలన్న వ్యూహం ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అత్యధికంగా హామీలు ఇచ్చేవారికే పదవి అన్న రీతిలో కొన్ని గ్రామాల్లో చర్చలు సాగుతున్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

ఓటుహక్కు ప్రజాస్వామ్యం కల్పించిన అత్యంత విలువైన ఆయుధం. ప్రజలు ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలొగ్గకుండా తమకు నచ్చిన నాయకుడిని స్వేచ్ఛగా ఎన్నుకోవడమే ఎన్నికల అసలు ఉద్దేశం. ఏకగ్రీవ ఎన్నికలు గ్రామంలో ఐక్యతకు, ఏకాభిప్రాయానికి ప్రతీకగా నిలవాలి. పదవుల కోసం ఆర్థిక హామీలు, రాజకీయ ఒత్తిళ్లు తెరపైకి వస్తే ఆ స్ఫూర్తి దెబ్బతినే ప్రమాదం ఉంది. ఏకగ్రీవం అంటే ప్రజలందరి సమ్మతి కావాలే తప్ప.. కొందరి ఆర్థిక బలంతో సాధించే ఏకాభిప్రాయం కాకూడదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

టీడీపీకి ఎమ్మెల్సీ రఘురాజు భార్య గుడ్‌బై

శృంగవరపుకోట: తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం దక్కకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాజు, ఆమె అనుచరులు వెల్లడించారు. బొడ్డవర గ్రామంలోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో సుధారాజు మాట్లాడారు. 14 మంది మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీపీలతో కలిసి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలుపునకు కృషిచేస్తే తగిన ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ప్రస్తుత ఎస్‌.కోట ఎమ్మెల్యే లలిత కుమారి, విద్యాశాఖమంత్రి నారా లోకేశ్‌ మోసం చేశారన్నారు. ఎలాంటి పదువులు, గౌరవం ఇవ్వలేదన్నారు. ఎమ్మెల్యేతో పాటు డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొంప కృష్ణ తమ వర్గాన్ని పూర్తిగా నిర్లక్ష్యపు ధోరణితో చూడటం, మాట్లాడటం మనస్థాపానికి గురిచేసిందన్నారు. ఎంపీటీసీ స్థానాల కేటాయింపులో అన్యాయం చేశారన్నారు. మాజీ జెడ్పీచైర్మన్‌ చిన్నశ్రీను సర్దుబాటుచేసిన ఐదు స్థానాలు కూడా కేటాయించలేదని, నచ్చితే పార్టీ కోసం పనిచేయాలని లేదంటే మానేయాలని ఇక్కడి నేతలు తేల్చిచెప్పారన్నారు. ఈ తరుణంలో విలువ లేని పార్టీలో ఆత్మగౌరవాన్ని చంపుకుని పని చేయలేమని, అధినాయకత్వం పట్టించుకోకపోవడం వల్లే టీడీపీ సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. ఏపీ టూరిజం బోర్డు డైరెక్టర్‌ పదవికి కూడా రాజీనామా చేసినట్టు తెలిపారు. భవిష్యత్తులో ఏ పార్టీలో చేరేది త్వరలో చెబుతామన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఒంటి అప్పారావు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement