వేపాడ: మండలంలోని చినగుడిపాల జంక్షన్ వద్ద శుక్రవారం 12డి సిటీ బస్సు డ్రైవర్ అప్రమత్తం కావడంతో త్రుటిలో పెనుప్రమాదం తప్పింది. బస్సులో ప్రయాణిస్తున్న 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. శివ యూపీ స్కూల్ పక్కనే ఉన్న వెల్డింగ్ వర్క్‌షాప్ నుంచి ఓ వ్యక్తి ద్విచక్రవాహానంపై ఆకస్మాత్తుగా రోడ్డుపైకి రావడంతో బస్సుడ్రైవర్ అప్రమత్తమై ప్రమాదాన్ని నివారించే సమయంలో బస్సు రోడ్డు పక్కకు బస్సు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనచోదకుడికి గాయాలయ్యాయి. అయితే బస్సులో ప్రయాణిస్తున్న 33 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు.


