విజయనగరం అర్బన్: పట్టణంలోని సీతం కళాశాలకు చెందిన బీటెక్ సీఎస్ఈ చివరి సంవత్సరం చదువుతున్న హేమశ్రీ, మౌనిక, భువన, ఉష ప్రతిష్టాత్మక గూగుల్ క్యాంపస్ అంబాసిడర్లుగా ఎంపికయ్యారు. వీరిలో సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, నూతన ఆవిష్కరణల పట్ల అభిరుచిని గుర్తించి వీరికి ఈ అవకాశం కల్పించారు. వీరు గూగుల్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ సాంకేతిక కార్యక్రమాల్లో భాగస్వామాలు కానున్నారు. అరుదైన అవకాశం అందిపుచ్చుకున్న విద్యార్థినులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి.రామమూర్తి, కళాశాల డైరెక్టర్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ మజ్జి శశిభూషణరావు, సీఎస్ఈ విభాగాధిపతి డాక్టర్ వేణుమాధవ్, ప్లేస్ మెంట్ విభాగం ప్రతినిధులు పాల్గొన్నారు.


