ఏమరుపాటుగా ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం
హెచ్చరిస్తున్న పోలీస్ వర్గాలు
నదీ తీరంలో పవిత్ర స్నానాలు, ఆధ్యాత్మిక, వనభోజాలు చేపట్టే క్రమంలో ప్రజలు తమ వ్యక్తిగత జాగ్రత్తలపై అప్రమత్తంగా ఉండాలి. నాగావళి నదీ తీరం పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ఇప్ప టికే మా సిబ్బంది గత అనుభవాలను పునఃసమీక్ష చేసి రక్షణ చర్యలపై దృష్టి పెడుతున్నారు. భక్తులకు, ప్రజలకు భద్రతకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. అవసరమైనచోట్ల నిబంధనలతో కూడిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయి స్తాం.
– ఎం.రాంబాబు, డీఎస్పీ, పాలకొండ
నాగావళి తీరం వెంబడి శైవక్షేత్రాల వద్ద పవిత్ర స్నానాలు సురక్షితంగా చేసే ప్రదేశాలను యం త్రాంగం తొలుత గుర్తించాలి. అక్కడ పాటించాల్సిన నిబంధనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేయాలి. దీనివల్ల భక్తులు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉండదు. నదీతీర గ్రామాలకు చెందిన యువత స్పందించి అధికారులకు సహకరించాలి.
– గవర ప్రవీణ్‌కుమార్, అన్నవరం,
పాలకొండ మండలం
పాలకొండ రూరల్:
కార్తీక మాసంలో నదీస్నానం పుణ్యదాయకమని భక్తులు భావిస్తారు. శైవక్షేత్రాలు దర్శించేముందు నదుల్లో పుణ్యస్నానాలాచరిస్తారు. నదిలో తెప్పలపై దీపాలు వెలిగిస్తారు. వీటిని ముక్తికి మార్గాలుగా తలుస్తారు. అయితే... పిల్లలు, వృద్ధులు, ఈతరానివారు నదీ స్నానాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లేదంటే ప్రమాదాల భారిన పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నది లోతు తెలియకుండా దిగితే మునిగిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
●గతేడాది కార్తీక మాసంలో పాలకొండ మండలం మంగళాపురం గ్రామానికి చెందిన ఆర్.అచ్చియ్య అనే వృద్ధుడు నాగావళి నదిలో స్నానం చేసేందుకు వెళ్లి మత్యువాత పడ్డాడు. అదే ఏడాది సమీప రేగిడి మండలం కందిశకు చెందిన ఆర్.శారద నదిలో గల్లంతై మృతదేహంగా తేలింది.
●ఇటీవల యరకారాపురంలో ఓ యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అన్నవరంలో ఇద్దరు యువకులు నదిలో దిగి మునిగిపోయారు. గతనెల మడపల చంద్రమ్మ అనే వృద్ధురాలు నాగావళి నదిలో కొట్టుకుపోగా అగ్నిమాపక శాఖ అధికారులు రక్షించారు.
పాలకొండ, రాజాం, ఆమదాలవలస నియోజకవర్గాల పరిధిలో నాగావళి నదీతీరం విస్తరించి ఉంది. ఈ తీరం వెంబడి అనేక పుణ్య క్షేత్రాలు, దేవాలయాలు ఉన్నాయి. కార్తీక మాసంలో పెద్ద సంఖ్యలో భక్తులు నదిలో స్నాన మాచరించడం పరిపాటి. దీనికి తోడు మాలధారణ చేసిన అయ్యప్ప, శివ, భవానీ స్వాములు నదిలోనే నిత్య పుణ్యస్నానాలు చేస్తున్నారు. నాగావళి నదీ తీరానికి ఆనుకుని ఉన్న పాలకొండ మండలం యరకరాయపురం, చిన మంగళాపురం, గొట్ట మంగళాపురం, గోపాపురం, అన్నవరం, అంపిలి గ్రామాల్లో ఉన్న సాధారణ ప్రజలు, భక్తులు నిత్యావసరాలకు, స్నానాలకు నదిపైనే ఆధారపడుతున్నారు. వీరఘట్టం మండల పరిధిలో నందివాడ, తలవరం, మొట్ట, కిమ్మి, బిటివాడ తదితర గ్రామాల ప్రజలు, ఆలయాలకు వెళ్లే భక్తులు నాగావళి నదిలో పవిత్ర స్నానాలు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో వరుస తుపానుల కారణంగా వర్షాలు కురవడం, తోటపల్లి, మడ్డువలస ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేయడంతో నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉంది. నీటి ప్రవాహంతో సుడులు, విపరీతమైన లోతుతో కూడిన మడుగులు ఏర్పడ్డాయి. మరోవైపు ఇసుక సేకరణ పేరిట నిబంధనలకు విరుద్ధంగా, విచ్చలవిడిగా తీరం వెంబడి తవ్వకాలు జరపడం ప్రమాదకరంగా మారింది. ఈ క్రమంలో అజాగ్రత్తగా ఉంటే ప్రాణాపాయంతో కూడిన ప్రమాదాలు తప్పవని అనుభవజ్ఞులు హెచ్చరిస్తున్నారు. భక్తులు, స్వాములు లోతుతక్కువ ఉన్న ప్రాంతాల్లో, అక్కడి స్థానికుల సూచనలతో స్నానాలు చేయడం, దీపాలు వదలడం వంటివి చేయాలి.


