ప్రజల గొంతు నొక్కాలని చూస్తున్నారా?
న్యూస్‌రీల్
పార్టీలు వేరు..
గిరిజనుల సమస్యలు వేరు
● కలెక్టర్ ప్రభాకరరెడ్డి
ప్రతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలి
వీరఘట్టం: ప్రతి మహిళ పారిశ్రామిక వేత్తగా ఎదగాలని కలెక్టర్ డాక్టర్ ఎన్.ప్రభాకరరెడ్డి పిలుపునిచ్చారు. వీరఘట్టం మండలం కంబర గ్రామంలో మంగళవారం నిర్వహించిన మన మాట–మన బాట కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉద్యానపంటలు సాగుచేసిన మహిళలు మార్కెట్ చేయడంలో మెలకువలు తెలుసుకోవాలని సూచించారు. గిట్టుబాటు ధర వచ్చేలా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. బంతి మొక్కలతో ఆరోగ్య భద్రత సాధించవచ్చన్నారు. ఇంటి ఆవరణలో బంతి మొక్కలు నాటితే దోమలు చేరవని తెలిపారు. కంబర పాఠశాలలో బంతి–చామంతి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలసి బంతి మొక్కలను పాఠశాల ఆవరణలో నాటారు. అలాగే, గట్టుమీద చెట్టు కార్యక్రమంలో గ్రామ శివారులో పలు రకాల పండ్ల మొక్కలను నాటారు. అంతకు ముందు స్థానిక ఎమ్మెల్యే జయకృష్ణతో కలిసి వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్, డీఆర్‌డీఏ పీడీ ప్రభావతి, జెడ్‌ఎంఎస్ కె.లలితకుమారి, ఉద్యానవన శాఖ పీడీ సత్యనారాయణ రెడ్డి, తహసీల్దార్ వి.రాజేశ్వరరావు, ఎంపీడీఓ బి.వెంకటరమణ, ఏఓ సౌజన్య, పశువైద్యాధికారి చైతన్యశంకర్, తదితరులు పాల్గొన్నారు.
తోటపల్లి ఆధునికీకరణకు
నిధులు వచ్చేలా చూడండి...
తోటపల్లి పాత ఆయకట్టు ఆధునికీకరణ పనులు ఆగిపోవడంతో ఈ ప్రాంత రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు జరిగేలా చూడాలని తోటపల్లి ప్రాజెక్టు కమిటీ చైర్మన్ పొదిలాపు విజయరమణి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కలెక్టర్ స్పందిస్తూ ప్రభు త్వం దృష్టికి రైతుల సమస్యను తీసుకెళ్తానని చెప్పారు.
ఆక్రమణలు తొలగించండి
ఊరు బాగుండాలన్నా.. ప్రజలు ఆరోగ్యంగా ఉండాలన్నా పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలని, కంబర గ్రామంలో మురుగు కాలువల ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఆదేశించారు. గ్రామానికి వస్తూ ఆక్రమణలను గుర్తించారు. అధికారులు చూసీచూడనట్లు ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించారు.
సాక్షి, పార్వతీపురం మన్యం/సాలూరు: మారికవలస గిరిజన గురుకుల పాఠశాల ఎత్తివేతపై తల్లిదండ్రులు చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలియజేసేందుకు బయలుదేరిన మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొరను పోలీసులు నిర్బంధించారు. ఆయనను మంగళవారం ఉదయం నుంచి సాలూరులోని నివాస గృహం వద్ద హౌస్ అరెస్ట్ చేశారు. కారులో బయలుదేరేందుకు రాజన్నదొర సిద్ధపడగా.. అడ్డంపడ్డారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనను అరెస్టు అయినా చేయాలని.. లేకుంటే బయటకై నా వెళ్లనివ్వాలని రాజన్నదొర పట్టుబట్టారు. పోలీసులు వెనక్కి తగ్గలేదు. దీంతో ఆయన తన ఇంటి వద్దే మీడియా సమావేశం ఏర్పాటుచేసి.. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండించారు. గిరిజన శాఖ మంత్రి సంధ్యారాణి నైజం ఎలాంటిదో గిరిజనులు, ప్రజలు తెలుసుకోవాలని కోరారు. గిరిజన విద్యార్థుల హక్కులు, భవిష్యత్తు కోసం తమ పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని స్పష్టం చేశారు.
ప్రశ్నిస్తే అరెస్టు చేయడమేనా?
తాను ఎలాంటి హింసాత్మక కార్యక్రమానికి వెళ్లలేదని, గిరిజన విద్యార్థులకు అండగా నిలిచేందుకు మాత్రమే వెళ్తున్నానని చెప్పారు. తనను ఒకచోట అడ్డుకుని, మరోచోటకు తీసుకెళ్లి నిర్బంధించారని చెప్పారు. ఇంటి వద్ద కూడా పోలీసులను కాపలా పెట్టి, తనను కలిసేందుకు ఎవరినీ అనుమతించలేదని తెలిపారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి మంత్రిగా పనిచేసిన తాను గతంలో ప్రజల నిరసనలను ఈ విధంగా అడ్డుకున్న సందర్భం లేదని గుర్తు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పాలించలేరా? పోలీసులను పెట్టుకుని పాలించడమే పాలనా విధానమా? అని రాజన్నదొర ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ ఎందుకు మౌనం?
గిరిజన విద్యార్థుల సమస్యపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మౌనం వహించడంపై రాజన్నదొర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తానని చెప్పే పవన్ కల్యాణ్.. గిరిజన విద్యార్థుల విషయంలో ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని కూటమి నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు గిరిజన విద్యార్థుల విద్యా సమస్యపై స్పందించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని తెలిపారు. తన అరెస్టు, నిర్బంధాన్ని ప్రస్తావిస్తూ రాజన్నదొర రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ప్రస్తావించారు. ఆర్టికల్ 13, 19, 21లకు రాష్ట్రంలో విలువ లేదా? అని ప్రశ్నించారు. ప్రజలకు మాట్లాడే స్వేచ్ఛ, సంచరించే స్వేచ్ఛ, సమావేశాలు నిర్వహించుకునే హక్కులు ఉన్నాయని.. శాంతియుతంగా నిరసన తెలిపే వారిని అరెస్టు చేయ డం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు.
గిరిజన శాఖ మంత్రి బాధ్యత ఏమిటి?
గిరిజన విద్యార్థులకు అండగా నిలవాల్సిన గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి.. అదే విద్యార్థుల కోసం పోరాడుతున్న తల్లిదండ్రులు, గిరిజన సంఘాల నేతలు, యువకులను అరెస్టు చేయించే పరిస్థితి రావడం ఏమిటని రాజన్నదొర ప్రశ్నించారు. గిరిజనుల సంక్షేమం కోసం పనిచేయాల్సిన మంత్రి ముందుగా వారి విద్యా సమస్యలను పరిష్కరించాలని కోరారు. గిరిజన విద్యార్థుల కోసం పోరాడుతున్న వారిని అరెస్టు చేయడం ద్వారా సమస్య పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
మాజీ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి పట్ల పోలీసుల వైఖరి సరికాదు
మాజీ ఉప ముఖ్యమంత్రి, మహిళా నేత పుష్పశ్రీవాణి పట్ల పోలీసుల వైఖరిపై రాజన్నదొర తీవ్రంగా స్పందించారు. మూడు సార్లు ఎమ్మెల్యేగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన మహిళా నేతను నిరసన కార్యక్రమానికి వెళ్తుండగా అడ్డుకోవడం, పోలీసులు ఆమెను చీర పట్టుకుని లాగడం అమానుషమని అన్నారు. ‘ఇదేనా మానవత్వం? ఇదేనా సభ్యత? ఇదేనా సంస్కారం?’ అని ప్రశ్నించారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ ఘటనపై స్పందించాలని డిమాండ్ చేశారు.
గుమ్మలక్ష్మీపురం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ‘సీఎం సార్ మా డబ్బులు మాకివ్వండి’ అంటూ
నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతున్న రెవెన్యూ ఉద్యోగులు
గిరిజన విద్యార్థుల సమస్యలపై శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా ప్రభుత్వం కాలరాస్తోందని రాజన్నదొర ఆరోపించారు. మారికవలసలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను తరలించడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు చేపడుతున్న ఆందోళనలకు మద్దతుగా తాను వెళ్తుండగా.. పోలీసులు అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలించాల్సిన ప్రభుత్వం పోలీసులతో ప్రజల గొంతు నొక్కాలని చూస్తోందా? అని ప్రశ్నించారు. మారికవలసలోని స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఎత్తివేయడం గిరిజన విద్యార్థులకు తీవ్ర అన్యాయం చేయడమేనని అన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్న ఈ పాఠశాలలో ప్రవేశం కోసం విద్యార్థులు పోటీ పరీక్షలు రాసి ఎంపికవుతున్నారని తెలిపారు. అలాంటి పాఠశాలను ఎందుకు ఎత్తివేయాల్సి వచ్చిందో ప్రభుత్వం స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన పిల్లలు ఆంగ్ల విద్య చదవకూడదా? అని ప్రశ్నించారు. విద్యార్థులను అర్ధరాత్రి సమయంలో బస్సుల్లో తరలించడం, వారి సామగ్రిని బయటకు తీసుకురావడం బాధాకరమన్నారు. గిరిజన సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జిల్లా పరిషత్, ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, జూనియర్ కళాశాలల్లోని లెక్చరర్ల సేవలను వినియోగించుకుని ప్రభుత్వమే నాణ్యమైన కోచింగ్ అందించవచ్చని తెలిపారు. గిరిజన విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన వనరులను ప్రైవేటు సంస్థలకు అప్పగించి వ్యాపార కేంద్రాలుగా మార్చడం సరికాదని విమర్శించారు.
గిరిజనుల సమస్యలను రాజకీయాలకు అతీతంగా చూడాలని రాజన్నదొర అన్నారు. పార్టీలకు అతీతంగా గిరిజన సంఘాలు, యువత, తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు కోసం పోరాడుతున్నారని తెలిపారు. గిరిజన విద్యార్థుల స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ కొనసాగించాలని, విద్యార్థులను బలవంతంగా తరలించకుండా చూడాలని, కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు. గిరిజన విద్యార్థుల విద్యా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు. నిరసనలను అణచివేయడం కాకుండా సమస్యపై స్పందించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజన్నదొర
నిర్బంధం
మారికవలస వెళ్లనీయకుండా అడ్డుకున్న పోలీసులు
ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించిన మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర
పుష్పశ్రీవాణిపై పోలీసుల దురుసు ప్రవర్తనను ఖండిస్తున్న మాజీ ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర


