బాధ్యత అనే ప్రశ్న వినిపిస్తోంది. వాహనదారులకు సత్వరమే, పారదర్శకంగా సేవలు అందించాలనే ఉద్దేశంతో రవాణాశాఖ తీసుకొచ్చిన ఆన్‌లైన్ వ్యవస్థ వాహనదారులకు చుక్కలు చూపిస్తోంది. జాతీయస్థాయి వాహన్ (వీఏహెచ్‌ఏఎన్) పోర్టల్ సర్వర్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యల కారణంగా పలుసేవలు అందని పరిస్థితి నెలకొంది.
సర్వర్ సమస్య వల్ల డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్, వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్, ఫైనాన్స్ క్లియరెన్స్ వంటి సేవలు అవడం లేదు. ఫైనాన్స్‌లో వాహనాల రుణం పూర్తిగా చెల్లించిన తర్వాత రవాణాశాఖ రికార్డుల నుంచి చేయాల్సిన హైపోథికేషన్ క్యాన్సిలేషన్ పక్రియ పూర్తిగా జరగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సైట్‌లో ఫైనాన్స్ హైపోథికేషన్ క్యాన్సిలేషన్ క్లియరెన్స్ ఆప్లికేషన్‌ను సబ్‌మిట్ చేసినా , క్యాన్సిల్ చేసినా సిస్టమ్ పదేపదే ఈకేవైసీ వివరాలను అడుగుతోంది. తీరా అధార్ వివరాలు ఇస్తే వివరాలు సరిపోవడం లేదని ఎర్రర్ చూపిస్తోంది. కోరిన పక్రియ పూర్తి చేసినా ముందుకు వెళ్లకుండా మళ్లీ మొదటి దశకు వచ్చి అదే సమాచారం కోరుతుండడంతో తలలు పట్టుకుంటున్నారు. ఈ సాంకేతిక సమస్యకు పరిష్కారం కనుగొనలేక రోజుల తరబడి వాహనదారులు తిరగాల్సి రావడం విమర్శలకు దారితీస్తోంది.
అవస్థలు పడుతున్న వాహనదారులు
నిత్యం రవాణాశాఖ కార్యాలయానికి ఫైనాన్స్ క్లియరెన్స్, రిజిస్ట్రేషన్ రెన్యువల్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ వంటి పనుల నిమత్తం వాహనదారులు వస్తున్నారు. వాహన్ సర్వర్ పనిచేయకపోవడం వల్ల గంటల తరబడి నిరీక్షించి పనిజరగకపోవడం వల్ల నిరాశతో వెనుదిరుగుతున్నారు.
విజయనగరం ఫోర్ట్:
పై సమస్య ఈ ఒక్కవాహనదారుకే కాదు. జిల్లాలోని అనేక మంది వాహనదారులకు ఇదే పరిస్థితి ఎదురువుతోంది. సుమారు నెల రోజులుగా ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ రవాణాశాఖ అధికారులు పట్టించుకోవడం లేదని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెన్యువల్స్ జరగకుండా వాహనం నడిపి తనిఖీల్లో పట్టుబడితే ఎవరిది
నెల్లిమర్ల మండలం కొండగుంపాం గ్రామానికి చెందిన ఎం.శ్రీనివాసరావు తన ద్విచక్రవాహనానికి 15 ఏళ్ల కాలపరిమితి అయిపోవడంతో మరో 5 ఏళ్లు పొడిగించుకోవడానికి కొద్దిరోజుల క్రితం రవాణాశాఖ కార్యాలయానికి వెళ్లాడు. వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు సంబంధించి ట్యాక్స్‌లు, ఇతర చలానాలు అన్నీ కట్టేశాడు. వాహనం రిజిస్ట్రేషన్ చేయడానికి వాహన్ పోర్టల్ సర్వర్‌లో వివరాలు కొడితే అధార్‌లో తండ్రి పేరుకు వాహన్ పోర్టల్‌లో తండ్రిపేరుకు సరిపోలేదని వచ్చింది. రవాణశాఖ అధికారులను అడిగితే అధార్ సెంటర్‌లో అడగమని చెప్పారు. అధార్ సెంటర్‌లో అడిగితే మాకు సంబంధం లేదని చెప్పారు. అలా ఆ ఇద్దరూ సమస్య పరిష్కరించకపోవడంతో సదరు వాహనదారు వాహనానికి ఇప్పటికీ రిజిస్ట్రేషన రెన్యువల్ జరగలేదు.
మా పరిధిలో లేదు
వాహన్ సర్వర్ సాంకేతిక సమస్య మా పరిధిలో లేదు. రాష్ట్ర స్థాయి అధికారులు పరిష్కరించాల్సి ఉంటుంది.
– మణికుమార్, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్
రిజిస్ట్రేషన్ రెన్యువల్, ఫైనాన్స్ క్లియరెన్స్‌కు ఆటంకాలు
అవస్థలు పడుతున్న
వాహనదారులు


