విజయనగరం క్రైమ్: తెలుగు కళా, సాహిత్య, సాంస్కృతిక రంగాలపై చెరగని ముద్ర వేసిన హరికథా పితామహుడు శ్రీ ఆదిభట్ల నారాయణదాసు 162వ జయంతి కార్యక్రమం ఆదిభట్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ అధ్యక్షుడు ఆనంద నారాయణదాసు నేతృత్వంలో సోమవారం ఘనంగా జరిగింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కానుకుర్తివారి వీధిలో గల ఆదిభట్ల నివాసంలో జరిగిన కార్యక్రమంలో ముందుగా ఆదిభట్ల నారాయణదాసు విగ్రహానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుంకలాం జెడ్పీ హైస్కూల్ స్టూడెంట్స్ శ్లోకాలను ఆలపించారు. కార్యక్రమానికి హాజరైన గుంకాలం జెడ్పీ హైస్కూల్ హెచ్‌ఎం డాక్టర్ వెలమల శ్రీనివాసరావు మాట్లాడుతూ, శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆదిభట్ల నారాయణదాసు కళా వారసత్వాన్ని పరిరక్షిస్తూ హరికథకు, కళాకారులకు అందిస్తున్న ప్రోత్సాహం సాంస్కృతిక రంగానికి ఎంతో విలువైన సేవ అని పేర్కొన్నారు.ఆదిభట్ల నారాయణదాసు ఒక మహోన్నత సంతకం. హరికథ కళకు స్వర్ణయుగాన్ని అందించిన మహనీయుడు. సాహిత్యం, సంగీతం, హరికథ, సంస్కృతిౄఅన్నింటినీ సమన్వయం చేసి తెలుగు కళా వైభవాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చిన విశిష్ట ప్రతిభాశాలి అరి డాక్టర్ వెలమల శ్రీనివాసరావు కొనియాడారు. కార్యక్రమంలో శ్రీ ఆదిభట్ల ఫౌండేషన్ అధినేత, ఆదిభట్ల మునిమనుమడు ఆనంద నారాయణ దాసు మాట్లాడుతూ హరికథ కేవలం ఒక కళారూపం మాత్రమే కాదని, తెలుగు సాహిత్యం, సంగీతం, సంస్కృతి, ఆధ్యాత్మికతలను ఒకే వేదికపై సమన్వయం చేసే మహత్తర సాంస్కృతిక సంపద అని పేర్కొన్నారు. ఆదిభట్ల నారాయణదాసు హరికథ వేదికపై నిలబడితే అది ఒక కళాకారుడి ప్రదర్శన మాత్రమే కాదుం తెలుగు భాషా మాధుర్యం, సాహిత్య వైభవం, సంగీత గాంభీర్యం, సంస్కృతి గొప్పతనం ఒకే వేదికపై సాక్షాత్కరించిన మహోత్సవం. ఆయన ప్రతిభ తెలుగు కళా చరిత్రలో ఒక శాశ్వత అధ్యాయం. అని అన్నారు.
ఆకట్టుకున్న హరికథా గానం
అనంతరం ప్రముఖ హరికథ భాగవతార్ బి.యతిరాజు అందించి హరికథ గానామృతం ధ్రువ చరిత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంది. కార్యక్రమంచివరిలో ప్రెండ్స్ ఫౌండేషన్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు ప్రముఖ మృదంగ విద్వాంసుడు, డా మండపాక రవి దంపతులను దుశ్శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు రాజ్యలక్ష్మి, మంజూషలతో పాటు గురజాడఅప్పారావు వారసులు ఇందిర, రాజ్యలక్ష్మి, మంజూష,ధవళ సర్వేశ్వరరావు, బీజేపీ నేత శివ ప్రసాద్ రెడ్డి, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు


