ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

Sep 1 2026 1:19 AM | Updated on Sep 1 2026 1:19 AM

కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి

పీజీఆర్‌ఎస్‌–రెవెన్యూ క్లినిక్‌లో

207 వినతుల స్వీకరణ

1100 ఫిర్యాదులపైనా దృష్టి

1100 టోల్‌ఫ్రీ సేవల ద్వారా వచ్చే ఫిర్యాదులను కూడా నిర్లక్ష్యం చేయకుండా పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. అర్జీదారుతో మాట్లాడి సమస్యను పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నివేదిక ఇవ్వాలని సూచించారు. 1100 సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అరుణకుమారి, పీజీఆర్‌ఎస్‌ నోడల్‌ అధికారి ఇ.మురళి, జిల్లా స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌లు వెంకటరెడ్డి, సూర్యకళ, ఆర్డీవోలు సుధారాణి, సుధాసాగర్‌, జగన్నాథ రావు, సీపీవో బాలాజీ, డీఆర్‌డీఏ పీడీ శ్రీనివాసపాణి, హౌసింగ్‌ పీడీ మురళీమోహన్‌, డీపీవో మల్లికార్జున్‌, డీఈఓ మణిక్యంనాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ ఏవో దేవిప్రసాద్‌, తహసీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

బాధితులకు తక్షణమే పరిష్కారం చూపాలి

విజయనగరం టౌన్‌: సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చే బాధితులకు తక్షణ పరిష్కారం చూపాల్సిందేనని ఎస్పీ ఏఆర్‌.దామోదర్‌ అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితుల నుంచి 35 ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. బాధితుల సమస్యలను విన్న ఆయన వెంటనే టెలిఫోన్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా సంబంధిత పోలీస్‌ అధికారులతో మాట్లాడి, సమస్యలను వివరించారు. ఫిర్యాదుదారుల పట్ల సానుకూలంగా స్పందించాలని, బాధితుల సమస్యల పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టి వారికి సాంత్వన చేకూర్చాలని చెప్పారు. గ్రీవెన్స్‌లో భూతగాదాలకు సంబంధించి 20, కుటుంబ కలహాలకు సంబంధించి నాలుగు, మోసాలకు పాల్పడినట్లు మూడు , ఇతర అంశాలకు సంబంధించి ఎనిమిది ఫిర్యాదులు వచ్చాయి.

విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌),రెవెన్యూ క్లినిక్‌లో వచ్చిన ప్రతి వినతిని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో పరిష్కరించాలని సూచించారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లోని ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌–రెవెన్యూ క్లినిక్‌లో మొత్తం 207 వినతులు స్వీకరించగా..అందులో 98 రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉన్నాయి. భూ, సర్వే సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి నివేదికలకే పరిమితం చేయకుండా అవసరమైన చోట క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్‌ సూచించారు. రెవెన్యూ, భూసర్వే తదితర సమస్యలకు సంబంధించిన వినతులు అధికంగా వస్తున్న నేపథ్యంలో వాటి పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. భూ సమస్యలను కేవలం కార్యాలయ స్థాయి రికార్డులు, నివేదికల ఆధారంగా పరిష్కరించకుండా, అవసరమైన చోట క్షేత్రస్థాయి రికార్డులు,నివేదిక ఆధారంగా పరిష్కరించకుండా, అవసరమైన చోట క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా పరిశీలించి, సంబంధిత వ్యక్తులతో మాట్లాడి, రికార్డులను పరిశీలించిన తర్వాత వాస్తవ పరిస్థితుల ఆధారంగా సమస్యకు పరిష్కారం చూపాలన్నారు. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అర్జీలను ప్రాధాన్యతతో పరిష్కరించి, ప్రజలు ఒకే సమస్యపై పదేపదే కార్యాలయాల చూట్టూ తిరిగే పరిస్థితి లేకుండా చూడాలని ఆదేశించారు.

మాట్లాడాకే ఎండార్స్‌మెంట్‌..

పీజీఆర్‌ఎస్‌ అర్జీల పరిష్కారంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని కలెక్టర్‌ స్పష్టం చేశారు. అర్జీదారుతో నేరుగా మాట్లాడిన తర్వాతే ఎండార్స్‌మెంట్‌ ఇవ్వాలి. వారితో మాట్లాడిన తేదీ, సమయాన్ని నివేదికలో తప్పనిసరిగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కేవలం కాగితాలపై నివేదికలు ఇవ్వకుండా సమస్య వాస్తంగా పరిష్కారమైందా లేదా నిర్ధాదించుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement