35 మంది పేకాటరాయుళ్ల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

35 మంది పేకాటరాయుళ్ల అరెస్టు

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

భట్రాజు సంక్షేమానికి సహకరించండి

రూ.1.68 లక్షలు నగదు స్వాధీనం

సాలూరు రూరల్‌: కరాసువలస గ్రామ సమీపంలో వినియోగంలో లేని కోళ్లఫారం షెడ్లలో పేకాట ఆడుతున్న 35 మందిని సీఐ రామకృష్ణ, ఎస్‌ఐ రవీంద్రరాజు ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నట్టు ఏఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. సాలూరు పరిసర ప్రాంతాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో ఇటీవల సీఐతో చర్చించామని, కొద్ది రోజులకే భారీ పేకాట స్థావరాన్నిపట్టుకున్నామని తెలిపారు. పేకాట స్థావరంలో 35 మందితో పాటు రూ.1.68 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. రూ.1.17 లక్షల ఖరీదు చేసే 23 కాయిన్స్‌ పట్టుబడ్డాయన్నారు.

విజయనగరం గంటస్తంభం: రాష్ట్ర, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేశ్‌ను ఆంధ్రప్రదేశ్‌ భట్రాజు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్మి సీహెచ్‌ సతీష్‌ రాజు విజయనగరంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. భట్రాజు కార్పొరేషన్‌లో డైరెక్టర్ల నియామకం, శ్రీశైలం దేవస్థానంలో భట్రాజు సంక్షేమ సంఘం నిత్య అన్నదాన సత్రానికి స్థలం కేటాయించాలని మంత్రికి వినతిపత్రం అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement